ఆంధ్రుల సంప్రదదాయ వంటకం పెసరట్టు. పెసరట్టు అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు చెప్పండి. కొంతమందికి అయితే రోజుకో పెసరట్టు తినకపోతే టిఫిన్ తిన్నట్టే ఉండదు .
మద్యం,సిగరెట్లకు ఎలా బానిసలవుతారో పెసరట్టుకి అలా బానిసైపోయేవాళ్లు చాలామంది. అయితే ఎప్పటిలా ఒకేలా పెసరట్టు చేస్తే కొత్త రుచి ఏముంటది చెప్పండి. కొత్త పద్దతిలో పెసరట్టు చేస్తే ఎన్ని తింటున్నా అలా తింటూనే ఉంటారు.
ఆంధ్రా స్పెషల్ పెసరట్టుని కొత్త పద్దతిలో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఎండుమిర్చి
- జీలకర్ర
- రాత్రంతా నానబెట్టిన పెసలు
- నానబెట్టిన బియ్యం
- ఉల్లిపాయ
- శెనగపిండి
- ఉప్పు
- అల్లం
- ఆయిల్ లేదా నెయ్యి
పెసరట్టు తయారీ విధానం
- ముందుగా మిక్సీ గిన్నెలో 6 ఎండుమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల నానబెట్టిన బియ్యం, 2 టీస్పూన్ల శెనగపిండి, రాత్రంతా నానబెట్టుకున్న 1 కప్పు పెసలు, ఉప్పు, ఒకటిన్నర అంగుళం అల్లం, నీళ్లు కొన్ని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
2. గ్రైండ్ చేశాక పిండి మరీ చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి. -తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిమీద పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత పెద్ద గరిటతో పిండి తీసుకొని పెనం మీద కాస్త మందంగానే పరచాలి. అంచుల వెంట,మధ్యలో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి పోసి నిదానంగా కాల్చండి.
3. పెసరట్టు కాలుతున్న సమయంలో దానిమీద చిటికెడు జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం వేసి కాలనివ్వండి. రెండు వైపులా నిదానంగా బాగా కాలిన తర్వాత స్వవ్ ఆఫ్ చేసి పెసరట్టుని ప్లేట్ లోకి తీసుకుంటే తినడానికి రెడీ. అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఈ పెసరట్టు తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది.