
మీకు నగరంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉందా? కానీ డబ్బు లేక ఆ కలని వదులుకోవాల్సి వస్తుందా? అయితే ఇప్పుడు మీ కల నిజం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (PMAY-Urban) పథకం మీలాంటి వారికోసమే.
ఈ పథకం ద్వారా సంవత్సరానికి ₹9 లక్షల లోపు ఆదాయం ఉన్న నగర వాసులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. మీ సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి లేదా కొత్తగా కొనుగోలు చేయడానికి సబ్సిడీ రూపంలో రూ.2.5 లక్షల వరకు లాభం పొందవచ్చు.
PMAY-Urban అనేది 2015 జూన్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన గృహ నిర్మాణ పథకం. ఇది పట్టణాల్లో నివసించే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తుంది.
[news_related_post]ఈ పథకం తొలి దశ విజయవంతమైన తర్వాత, కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో PMAY-U 2.0ని ప్రకటించింది. ఈ కొత్త దశలో వచ్చే 5 సంవత్సరాల్లో 1 కోటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు కలిగించే లక్ష్యంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
పట్టణాల్లో నివసించే నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలవారికి ఇళ్లు కల్పించడం. తక్కువ ఆదాయం గల వారికి బ్యాంకు రుణాలపై వడ్డీ సబ్సిడీ అందించడం.
మీకు సొంత స్థలం ఉంటే ప్రభుత్వం ₹2.5 లక్షల వరకు సాయం చేస్తుంది. బిల్డర్లు నిర్మించే అర్బన్ ఇళ్లలో కొన్ని యూనిట్లు పేదలకు తక్కువ ధరకే ఇవ్వబడతాయి. భద్రతలేని ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి అదే ప్రదేశంలో కొత్త ఇల్లు కట్టించి ఇవ్వబడుతుంది. రెంటల్ హౌసింగ్ ద్వారా వలస కూలీలు, కూలీలు తక్కువ అద్దెకు ఇళ్లు అద్దెకు తీసుకోవచ్చు. హోం లోన్ తీసుకుంటే ₹2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
పథకం లో భాగమైన నాలుగు విభాగాలు: BLC (Beneficiary-Led Construction) – మీకు సొంత భూమి ఉంటే మీ ఇంటిని మీరు కట్టుకోవచ్చు. AHP (Affordable Housing in Partnership) – బిల్డర్లు నిర్మించే సబ్సిడీ ఇళ్లలో ఒక భాగం పేదలకు కేటాయించబడుతుంది. ISSR (In-Situ Slum Redevelopment) – మురికివాడలలో ఉన్నవారికి అదే ప్రదేశంలో ఇళ్లు కట్టించి ఇవ్వబడుతుంది. ARHC (Affordable Rental Housing Complexes) – వలస కూలీలకు తక్కువ అద్దెతో ఇళ్లు ఇవ్వబడతాయి.
ఇల్లు 30 నుండి 45 చదరపు మీటర్ల వరకు ఉండాలి. ఇంట్లో రెండు గదులు, ఓ కిచెన్, బాత్రూమ్, టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి.
ఇల్లు నిర్మాణం పూర్తవడానికి సగటున 12 నుంచి 18 నెలలు పడుతుంది.
కేంద్ర ప్రభుత్వ సాయం వివరాలు: పూర్తి సాయం రూ.2.5 లక్షలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.5 లక్షలు. మొత్తం సబ్సిడీ మూడు విడతలుగా వస్తుంది – మొదట 40%, తర్వాత 40%, చివరగా 20%. మీ ఇంటి ఖర్చు మొత్తానికి అనుగుణంగా మీరు కూడా ₹4.5 లక్షల నుంచి ₹6.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
వార్షిక ఆదాయం ₹3 లక్షల నుంచి ₹12 లక్షల మధ్య ఉంటే సబ్సిడీ లభిస్తుంది. ఇల్లు ధర ₹35 లక్షల లోపు ఉండాలి. హోం లోన్ పరిమితి ₹25 లక్షల లోపు ఉండాలి. సగటున రూ.1.8 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందవచ్చు.
పట్టణాల్లో నివసిస్తూ, స్వంత ఇల్లు లేని EWS, LIG, MIG వర్గాల కుటుంబాలు అప్లై చేయవచ్చు. ఇంతకుముందు ఏ గృహ పథకం నుండి లబ్ధి పొందినవారు అప్లై చేయలేరు. PMAY-Ruralకు అప్లై చేస్తే PMAY-Urbanకు అప్లై చేయలేరు.
ఆదాయ శ్రేణులు: EWS: వార్షిక ఆదాయం ₹3 లక్షల లోపు. LIG: ఆదాయం ₹3 లక్షల నుండి ₹6 లక్షల మధ్య. MIG: ఆదాయం ₹6 లక్షల నుండి ₹9 లక్షల మధ్య
వితంతువులు, సింగిల్ ఉమెన్, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు,
SC/ST వర్గాలు, మైనారిటీలు, స్ట్రీట్ వెండర్లు (PM Swanidhi),
PM విశ్వకర్మ కర్మకారులు, అంగన్వాడీ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికులు ప్రత్యేక వెసులుబాటును పొందుతారు.
ఆన్లైన్లో అప్లై చేయాడానికి PMAY-U అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. “Apply for PMAY-U 2.0” క్లిక్ చేయండి. స్టేట్ ఎంపిక చేసుకోండి. మీ ఆదాయం వివరాలు, ఆధార్ నంబర్ నమోదు చేయండి. మీకు ఇల్లు ఉందా, గతంలో సాయం పొందారా అనే ప్రశ్నలకు NO సెలెక్ట్ చేయండి.
ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు, ఇంటి సమాచారం, హోం లోన్ వివరాలు పూర్తి చేయండి. దస్తావేజులు అప్లోడ్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు (అభ్యర్థి & కుటుంబ సభ్యులది). బ్యాంకు ఖాతా వివరాలు (ఖాతా సంఖ్య, బ్రాంచ్, IFSC కోడ్). ఆదాయ ధృవీకరణ పత్రం (PDF, 100KB లోపు). భూమి డాక్యుమెంట్లు (BLC ఎంపిక కోసం).
ఈ పథకం ద్వారా లక్షల మంది తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ₹2.67 లక్షల వరకు సబ్సిడీ మీకు పెద్ద ఉపశమనం. ఇప్పుడు మీ ఇంటి కలను వాయిదా వేయకండి. వెంటనే అప్లై చేసి, ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోండి.