
AP స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులను ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ జూలై 7 నుండి 18 వరకు కొనసాగుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.sthreenidhi.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
[news_related_post]వయోపరిమితి: అభ్యర్థులు 01 జూన్ 2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: ఏ కేటగిరీ అయినా రూ. 1000 రుసుము చెల్లించాలి.
జీతం వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,520 వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: మొదట, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: https://www.sthreenidhi.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.