Motichoor Laddu: బూందీ గరిటె లేకుండా మోతీచూర్ లడ్డూలు? – ఇలా చేస్తే ఇంట్లోనే స్వీట్ షాప్ కంటే రుచిగా వస్తాయి…

“మోతీచూర్ లడ్డూ” అనే పేరు వింటేనే నోట్లో నీళ్లు వస్తాయి కదూ! బర్త్‌డే, ఫంక్షన్, స్పెషల్ రోజు అన్నీ పక్కనపెట్టి, స్వీట్ షాప్‌కి వెళ్లి ఈ లడ్డూల కోసం చూస్తుంటాం. కానీ ఇప్పుడు చెబుతున్న పద్ధతిలో చేయండి, బయట కొనాలన్న ఆలోచనే రాదు! అదీ గరిటె లేకుండా, తక్కువ టైమ్‌లో ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్‌ కంటే రుచిగా, చాలా మెత్తగా వస్తాయి. ఇక ఒక్క లడ్డూ తింటే ఇంకోటి తినాలనిపించేంత రుచిగా తయారవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముందుగా శనగపప్పును రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి కొద్దిసేపు వడగట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీలోకి నానిన శనగపప్పు వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని నూనెలో పునుగుల్లా వేయించాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి బయటకు తీసి చల్లారనివ్వాలి.

చల్లారిన ఈ పునుగుల్లను మిక్సీలో వేసి తడిగా కాకుండా చిన్నపాటి పొడివలె గ్రైండ్ చేయాలి. ఈ బూందీ మిశ్రమాన్ని పక్కన పెట్టి నెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ వేపుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో చక్కెర, కొద్దిగా నీరు వేసి కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం జిగురు వంటి స్థితికి వచ్చినప్పుడు రంగు కోసం ఫుడ్ కలర్ వేసి కలపాలి. తర్వాత అందులో బూందీ మిశ్రమం, యాలకుల పొడి, వేపిన డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇది పూర్తిగా కలిసిపోయి ఒక్కటయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

Related Posts

మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్నచిన్న లడ్డూలు చేసి చుట్టుకోవాలి. ఇవి తేమ రాకుండా ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే లడ్డూలు చాలా రోజులు తాజావిగా ఉంటాయి. ఒక్కసారి నోట్లో వేసుకుంటే చక్కెర, నెయ్యి, శనగపప్పు కలిసి నోరూరించే రుచి ఇస్తాయి.

ఇంట్లో చేయడం చాలా సులభం. గరిటె లేకపోయినా సరే, లడ్డూలు మాత్రం అద్భుతంగా వస్తాయి. ఈ విధంగా మోతీచూర్ లడ్డూలు చేసి మీ కుటుంబ సభ్యుల్ని సర్ప్రైజ్ చేయండి. లేట్ చేయకండి… ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఈ స్వీట్‌ని రోజూ అడుగుతారు!