Chekkalu: నూనె తక్కువగా పీల్చి, నెలరోజులూ కరకరలాడే చెక్కలు… బియ్యంపిండి లేకుండానే…

చెక్క గారెలు అంటే మనం చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినేవే. టిఫిన్‌కి, టీ టైమ్‌కి సరైన స్నాక్ ఇవి. సాధారణంగా చెక్కలు అంటే బియ్యప్పిండితోనే చేస్తాం. కానీ ఇప్పుడు మనం చూస్తుంది బియ్యంపిండి లేకుండా కూడా కరకరలాడే చెక్కలు ఎలా తయారు చేయాలో. అదీ గోధుమపిండితో! ఇవి తక్కువ నూనె పీల్చుతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ చెక్క గారెల తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లోనే ఉండే గోధుమపిండి, బొంబాయి రవ్వ, మొక్కజొన్నపిండి వంటివి వేసి చేసేస్తే చాలు. పైగా ఇవి తేలికగా జీర్ణమవుతాయి. సాధారణంగా శనగపిండి వేసినవి కడుపుకు బరువుగా అనిపిస్తే, ఇవి మాత్రం అంత బరువు లేకుండా తేలికగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చవు. అది కూడా ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

చెక్కలను తయారు చేసే ముందు పిండిని బాగా కలపాలి. ఇందులో వాము, జీలకర్ర, నువ్వులు, మెంతి ఆకుల పొడి వంటి వాసనలతో కూడిన పదార్థాలు వేసే కారణంగా రుచి కూడా పెరుగుతుంది. కొద్దిగా తడి వస్తే చాలు, చపాతీ ముద్దలా కలిపి, దానికి ఓ అరగంట రెస్ట్ ఇచ్చి, ఆ పిండితో చెక్కలుగా వత్తుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ ప్రెస్ లేక బటర్ పేపర్ మీద వత్తుకుంటే సరిపోతుంది.

Related Posts

తర్వాత నూనె బాగా వేడయ్యాక ఒక్కో చెక్కను నెమ్మదిగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. మీడియం మంటలో వేయిస్తే లోపల వరకు బాగా ఉడుకుతాయి. చివరగా వాటిని గాలి లోపలికి పోనివ్వని డబ్బాలో నిల్వ చేస్తే నెలరోజుల పాటు తాజాగా ఉంటాయి.

ఒక్కసారి మీరు ఈ గోధుమ పిండితో చెక్కలు చేసి చూడండి. బియ్యంపిండి వాడకుండానే రుచిగా, ఆరోగ్యంగా ఉండే ఈ స్నాక్స్‌కి ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. ఇక నెక్స్ట్ టైం చెక్కలు అంటే బియ్యంపిండి కాదు, గోధుమపిండే గుర్తొస్తుంది!