ఇటీవలి కాలంలో చాలా మందిలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. కొంతమంది యువకులు అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం జిమ్కి వెళతారు.
అంతేకాకుండా morning and evening walks చేస్తున్నారు. కొంతమంది రాత్రిపూట భోజనం మానేసి బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. మీరు రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గడం నిజంగా సాధ్యమేనా? అలా కాకుండా రాత్రి పూట భోజనం మానేస్తే ఎలాంటి side effects ఉంటాయో తెలుసుకుందాం. రాత్రి పూట భోజనం మానేయడం అస్సలు మంచిది కాదు.
స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలంటే రాత్రిపూట ఆహారంలో నియంత్రణ పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు ఉన్నవారు రాత్రిపూట అన్నానికి బదులు చపాతీ లేదా బ్రెడ్ తినమని వైద్యులు సహజంగా చెబుతారు. బియ్యంలో carbohydrates ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నానికి దూరంగా ఉండాలని అంటారు.
Related News
అన్నింటికంటే, రాత్రిపూట ఏమీ తినని వ్యక్తులకు తగినంత పోషకాలు లభించవు, ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిపూట ఆహారం తీసుకోకుండా బరువు తగ్గాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట భోజనం మానేయడం కంటే, వీలైనంత వరకు సాయంత్రం త్వరగా తినడం మంచిది. భోజనానికి నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉంటుందన్నారు. రాత్రి పూట ఏమీ తినకూడదని భావించే వారు సాయంత్రం పూట పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలని అంటున్నారు.
ఒక్కపూట భోజనం చేయడం మానేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోయి పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
కాబట్టి శరీరానికి పోషకాహార లోపం రాకుండా చూసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని, ఉప్పు, పంచదారతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. రాత్రిపూట సరైన ఆహారం తీసుకోకుండా నిద్రపోవడం వల్ల కూడా acidity problem వచ్చే అవకాశం ఉంది. శరీరానికి తగినంత శక్తి లేకపోతే, కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఈ ఆహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే dieting వల్ల వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు