మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కానీ మీరు డబ్బు పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇది తెలుసుకోవాలి. మోడీ సర్కార్ మంచి అవకాశం కల్పిస్తోంది.
మీరు రూ. 30 వేల వరకు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పోటీ గురించి తెలుసుకోవాల్సిందే. ఖాతాలకు ఉచితంగా రూ. 30 వేలు పొందవచ్చు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీకి చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం ఇటీవల మైగౌ భాగస్వామ్యంతో సూపర్ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఉమంగ్ యాప్‌ను ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఒక రీల్ తయారు చేయాలి. Umang App ప్రయోజనాలు, Digital India, ప్రజలకు ఉమంగ్ ప్రయోజనాలు తెలిసేలా చెయ్యాలి
మార్పులు, ఉమంగ్ యాప్‌ను సూపర్ యాప్ అని పిలవవచ్చా? వంటి అంశాలపై మీరు మీ రీల్స్‌ను తయారు చేసుకోవచ్చు
ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతి ఉంటుంది. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 15 వేలు అందజేస్తారు. రన్నరప్‌లకు రూ. 12 వేలు వస్తాయి. ఇక మూడోస్థానానికి రూ.10వేలు అందజేస్తారు. తదుపరి 7 మందికి రూ. 2వేలు అందజేస్తారు. వీడియో 90 సెకన్ల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు గడువు December 8.
అలాగే మీరు ఉమంగ్ యాప్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా తయారు చేయవచ్చు. ఈ పోటీ డిసెంబర్ 17 వరకు తెరిచి ఉంటుంది. ఈ పోటీలో విజేత అయితే.. రూ. 7,500 అందించబడుతుంది. ఇది మొదటి విజేతకు వర్తిస్తుంది. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు.. మూడో స్థానంలో ఉంటే రూ. 3500 ఇస్తారు. తదుపరి 7 మందికి రూ. 1500 ఇస్తారు.
ట్యాగ్‌లైన్ రైటింగ్ పోటీ కూడా ఉంది. ఈ పోటీ డిసెంబర్ 13 వరకు తెరిచి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు రూ. 7500 ఇస్తారు. రెండో స్థానంలో ఉంటే రూ. 5 వేలు, మూడో స్థానం రూ. 3,500 వస్తాయి. మరియు తదుపరి 7 మందికి రూ. 1500 చెల్లిస్తారు. ట్యాగ్‌లైన్ 7 పదాలలో ఉండాలి. ట్యాగ్‌లైన్ హిందీ లేదా ఇంగ్లీషులో ఉండవచ్చు. అంటే మూడు పోటీల్లోనూ విజేత అయితే.. రూ. 30 వేలు గెలుచుకోవచ్చు.