పేద, బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిలో కొన్నింటికి ఉన్నత విద్య అవసరం. కొన్ని పథకాలకు అర్హులు కావాలంటే.. చదువు లేకపోయినా పర్వాలేదు. 18 సంవత్సరాల వయస్సు సరిపోతుంది. అలాంటి పథకం గురించి ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. 18 ఏళ్లు నిండితే సరిపోతుంది. ప్రతిరోజూ 300 రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకీ ఈ పథకం ఏంటి.. ఇందులో చేరాలంటే ఏం చేయాలి..
ఇంతకీ ఈ పథకం ఏమిటి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకంలో కొత్తగా చేరిన వారికి జాబ్ కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి.
Related News
బ్యాంకు ఖాతాకు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. ఈ పత్రాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓకు ఇస్తే పరిశీలించి అర్హులకు జాబ్ కార్డు అందజేస్తారు. ఈ పథకంలో చేరిన వారు రోజుకు రూ.300 పొందవచ్చు. ఇప్పుడు ఈ పథకం కింద కనీస వేతనం రోజుకు రూ.300గా నిర్ణయించారు. కానీ చేసిన పనిని ప్రామాణికంగా తీసుకుని వారికి వేతనాలు చెల్లిస్తున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం అమలులో భాగంగా పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం జరిగితే, బాధితుడికి 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. చిన్న పిల్లలతో పనికి వచ్చే వారికి ఆయాలను నియమించాలనే నిబంధన ఉంది. జాబ్‌కార్డులో నమోదు చేసే సమయంలో, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ముందుగానే తెలియజేస్తారు. అయితే ఇది వేసవి కాలంలో మాత్రమే. అయితే దీన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తే… అన్నదాతలకు మేలు జరుగుతుంది.