Drinking Water: నీళ్లు ఇలా తాగారంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే.. జాగర్త !

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం dehydrated కు గురవుతుందని Doctors, dieticians and beauticians సలహాలు ఇస్తూనే ఉన్నారు. జుట్టు మరియు చర్మంతో సహా అన్ని శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ప్రశ్న ఏంటంటే.. నీళ్లు తాగడం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనాలు ఎలా లభిస్తాయి? నీరు త్రాగడానికి సరైన మార్గం ఏమిటి? రోజూ ఎంత నీరు తీసుకోవాలి? ఇలాంటి విషయాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడ చూద్దాం..

మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎప్పుడూ పడుకుని నీళ్లు తాగకండి. ఎప్పుడూ కూర్చొని నీళ్లు తాగాలి. మీకు బాగా దాహం వేసినప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగకండి. ఇది వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. కడుపు నిండా నీళ్లు ఎక్కువగా తాగకపోవడమే మంచిది.

Related News

ఖాళీ కడుపుతో కూడా ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల వాంతులు అవుతాయి. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. భోజనానికి కొద్దిసేపటి ముందు నీరు త్రాగాలి.

భోజనం చేసిన తర్వాత కూడా నిర్ణీత సమయం తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. తిన్న వెంటనే నీళ్లు తాగకపోవడమే మంచిది. ముఖ్యంగా summer లో చాలా మందికి చల్లని నీరు తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది నేరుగా refrigerator నుండి water తాగుతారు. ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నీరు విపరీతంగా చల్లగా ఉంటే, ఒకేసారి త్రాగకూడదు.