Lifestyle: వందేళ్లు జీవించాలని ఉందా..? అయితే ఇలా చేయండి..!!

ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. అది కూడా దీర్ఘాయుష్షుతో. అయితే ప్రస్తుత మారిన జీవనశైలి, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిడి కారణంగా, ప్రజలు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, జీవితంలో కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించడం సాధ్యమని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇప్పుడు ఆ 5 అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. సరైన ఆహారపు అలవాట్లే దీర్ఘాయువుకు మూలం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, కొవ్వు పదార్ధాలను వీలైనంత తగ్గించాలి.

2. రోజువారీ వ్యాయామం శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. నడక, యోగా లేదా జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి, మీరు ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

Related News

3. ఒత్తిడిని తగ్గించడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీని కోసం ధ్యానం, ప్రాణాయామం సాధన చేయాలి. మీరు ఖచ్చితంగా పగటిపూట కనీసం కొంతకాలం యోగా, ధ్యానం చేయాలి.

4. సరైన నిద్ర మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే మీరు రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇది శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

5. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం అలవాటు చేసుకోండి. సామాజిక సంబంధాలు మానసిక ఆనందాన్ని పెంచుతాయి, ఒంటరితనాన్ని నివారిస్తాయి.