భారతదేశంలోని అతి ప్రధాన వ్యవస్థలో రైల్వే వ్యవస్థ ఒకటి. నిత్యం రైళ్ల ద్వార ఎంతో మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. టికెట్ ధర కూడా తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైళ్లల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అలానే రైల్వే శాఖ కూడా అనేక రకాల సౌకర్యాలను ప్రయాణికులకి అందిస్తుంది. ఇక ప్రయాణ సమయంలో చాలా మంది జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా స్లీపర్ క్లాస్ బోగీ ఎక్కుతుంటారు. టీటీడీ వచ్చి, జరిమానా విధిస్తుంటారు. కాబట్టి జనరల్ టిక్కెట్‌పై స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించడం చేయవచ్చా లేదా? రైల్వే రూల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందరికి రిజర్వేషన్లు దొరకడం అనేది అసాధ్యం అలానే. చాలా మంది ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని రైలులో ప్రయాణిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జనరల్ బోగీలు చాలా రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో కొందరు రిజర్వేషన్ బోగీల్లోకి వెళ్తారు. ఈక్రమంలో టీటీడీ జనరల్ బోగీలోకి పంపించడం లేదా ఫైన్ విధించడం చేస్తుంటారు. ఇలా జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ లో ప్రయాణించే వారు.. కొన్ని విషయాలు తెలుసుకుంటే ఇబ్బంది లేదు. రైల్వే కు సంబంధించిన కొన్ని షరతులకు లోబడి జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్‌లోకి వెళ్లొచ్చు. దీనికి సంబంధించి రైల్వే రూల్స్ 1989లో పేర్కొనబడింది. ఈ నియమం ప్రకారం.. ఎవరైనా ప్రయాణం 199 కిమీ లేదా అంతకంటే తక్కువ అయితే 3 గంటలు సాధారణ టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది అంట. అలానే జనరల్ టికెట్ ఉన్నప్పుడు, జనరల్ కోచ్‌లో లేనప్పుడు, మీరు తదుపరి రైలు కోసం వేచి ఉండాల్సి ఉంటుందని చెబుతోంది. జనరల్ టికెట్ వాలిడిటీ 3 గంటలు మాత్రమే ఉంటుంది.
Related News
అప్పటి వరకు వేరే రైలుకు ప్రత్యామ్నాయం లేకుంటే అప్పుడు మీరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చట. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం స్లీపర్ కోచ్‌కి వెళ్లిన తర్వాత ముందుగా టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది. తర్వాత టీటీఈ కి మీ జర్నీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఒకవేళ స్లీపర్ క్లాస్ లో సీటు ఖాళీగా ఉంటే టీటీఈ జనరల్, స్లీపర్ క్లాస్ మధ్య వ్యత్యాసంతో ధరతో రసీదుని అందజేస్తారు. ఒక వేళ కానీ సీట్లు ఖాళీగా లేకుంటే తదుపరి స్టేషన్‌కు వరకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అక్కడ దిగి జనరల్ బోగీలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదు జనరల్ కోచ్ లో ప్రయాణం చేయలేను అనుకుంటే.. టీటీడీ చెప్పిన ధర చెల్లించి.. స్లీపర్ క్లాస్ లోనే సీటు లేకుండా ప్రయాణం చేయవచ్చు. రైలులో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు ఈ నిబంధనలన్నీ తెలుసుకోవాలి. ఇలాంటి సమయంలో నిబంధనలు తెలియకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు.