Fevers : రాష్ట్రం మొత్తం జ్వరాలతో ఇబ్బంది.. ప్రాణాంతకం గా మారుతున్న డెంగ్యూ .. జాగర్తలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆగస్టు మొదటి పద్దెనిమిది రోజుల్లో అధికారికంగా తెలంగాణ మరియు ఆంధ్ర లో వేల సంఖ్యలో డెంగ్యూ సోకింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

తెలంగాణాలో సగం కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అయినాయి . వరంగ్‌లో డెంగ్యూ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకోవడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని.. డెంగ్యూ బారిన పడి.. స్థానికంగా వైద్యం చేయించుకుంటున్న గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఉంటారని అంచనా.

డెంగ్యూ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

డెంగ్యూ జ్వరం అత్యంత ప్రమాదకరమైనది. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్ లెట్స్ పడిపోవడమే కాకుండా అంతర్గత రక్తస్రావం కూడా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ జ్వరానికి సరైన వైద్యం అందకపోతే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ సమయంలో అధిక జ్వరం చెమటలు పట్టడం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తుంది. ఇది శరీరంలో సోడియం మరియు పొటాషియం తగ్గుతుంది. ఇతరత్రా సమస్యలు తలెత్తితే డెంగ్యూ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.

తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 4100 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సగానికి పైగా నమోదైంది. ప్రతిసారీ వర్షాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే దీన్ని డెంగ్యూ సీజన్ అని కూడా అంటారు. అందుకే.. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆంధ్ర లో సైతం ఏలూరు, భీమవరం, తూర్పు గోదావరి జిల్లాలలో వైరల్ మరియు డెంగ్యూ జ్వరాల కేసులు అధికం గానే ఉన్నాయి.. కొందరికి అత్యధిక నొప్పులతో కూడిన చికున్ గున్యా తరహా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి

ఇంట్లో దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి!

డెంగ్యూ పూర్తిగా దోమల వల్ల వస్తుంది. డెంగ్యూకి కారణమయ్యే దోమ.. మోకాళ్ల కింద మాత్రమే ఉంటుంది. అంతకన్నా దిగువన పడుతుందని అంటున్నారు. అందుకే.. వర్షాకాలంలో ఇళ్లల్లో ఎక్కడా నీటి లీకేజీ లేకుండా చూసుకోవాలి. అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు.. దోమల నివారణకు ఏదైనా వాడాలని సూచించారు. అన్నింటికీ మించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. సాధారణంగా జ్వరం వచ్చి పోతుంది.. కానీ డెంగ్యూ జ్వరం వస్తే మాత్రం.. డబ్బు, ఆరోగ్యంతో సహా అన్నీ చాలా పడుతుంది. అందుకే ఈ జ్వరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *