
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించింది. మీ-సేవా కేంద్రాలలో కేవలం రూ. 45 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, అధికారులు చిరునామాకు వచ్చి వివరాలను సేకరిస్తారు. అదనంగా, దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.