Chilli Chicken: చిల్లీ చికెన్ అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా..

మాంసాహార ప్రియులు చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు ఇలా ఎన్నో రకాల ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ, పులావ్, కర్రీ ఫ్రై ఇలా రకరకాల ఫుడ్స్‌ తయారుచేస్తారు. అయితే కొన్ని చికెన్ ఐటమ్స్ ఇంట్లో తయారు కావు.. అందుకే రెస్టారెంట్ కి వెళ్తారు. అందులో చిల్లీ చికెన్ ఒకటి. ఇది ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, రెస్టారెంట్లలో కూడా ప్రసిద్ధి చెందింది. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చిల్లీ చికెన్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

చికెన్‌ని ఇష్టపడేవారు చికెన్‌తో రకరకాల వంటకాలు చేస్తారు. ఎముకలు లేని చికెన్. బోన్-ఇన్ చికెన్ వివిధ ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అందులో ఒకటి చిల్లీ చికెన్.. అంటే పచ్చిమిర్చితో చేసిన చికెన్. దీనినే చిల్లీ చికెన్ అంటారు. ఇది ప్రసిద్ధ ఇండో-చైనీస్ వంటకం. చాలా మంది చిల్లీ చికెన్‌ని ఇష్టపడతారు మరియు ఇంట్లో తయారు చేయకుండా రెస్టారెంట్‌కు వెళతారు. అయితే కాస్త ట్రై చేస్తే టేస్టీగా చిల్లీ చికెన్ తయారు చేసి తినొచ్చు. చిల్లీ చికెన్ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం..

చిల్లీ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • బోన్‌లెస్ చికెన్ – అర కిలో
  • మొక్కజొన్న పిండి – రెండు టీ స్పూన్లు
  • ఉల్లిపాయ ముక్కలు – మూడు టీస్పూన్లు
  • కోడి గుడ్డు – ఒకటి
  • మిరియాల పొడి – అర టీస్పూన్
  • సోయా సాస్ – 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి – 5
  • వెల్లుల్లి రెబ్బలు – 4 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • చక్కెర – ఒక టీస్పూన్
  • నీరు – 2 కప్పులు
  • నూనె – తగినంత
  • కొత్తిమీర – కొద్దిగా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేసే విధానం: ముందుగా చికెన్‌ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ ముక్కలను వేసి, తర్వాత మొక్కజొన్న పిండి, సోయాసాస్, ఉప్పు వేసి కోడి గుడ్డు పగలగొట్టి అందులో వైట్ అండ్ గ్రీన్ సోయా సాస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత గిన్నెను మూతపెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేయించడానికి పాన్ తీసుకుని, అందులో తగినంత నూనె వేసి, అది వేడెక్కిన తర్వాత, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను మంటపై వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టండి.

ఇప్పుడు మళ్లీ కడాయి తీసుకుని స్టౌ మీద పెట్టి అందులో కాస్త నూనె వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు వేడినీటిలో ఒక టీస్పూన్ పంచదార, మిరియాల పొడి, ఉప్పు మరియు కొద్దిగా సోయా సాస్ కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. నీరు ఆవిరైపోయే వరకు చికెన్ ఉడికించి, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు తరిగిన కొత్తిమీర జోడించండి. అంతే టేస్టీ చిల్లీ చికెన్ రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *