AI (Artificial Intelligence). ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇది మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది . ఈ AI తో టెక్నాలజీ పరంగా కొత్త శకం ప్రారంభమైంది. చివరికి ఇది కీలక రంగాలలో ఆధిపత్యం చెలాయించే స్థాయికి ఎదిగింది. సేవా రంగాలతో పాటు, విద్య.. ఉపాధికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. AI లేకుండా భవిష్యత్తు లేనంతగా పరిస్థితి మారుతోంది. ఇప్పుడు, ఉద్యోగాలపై AI పెను భూతం లా విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలి.. భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి.. ఇపుడు చూద్దాం
Artificial Intelligence. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రముఖ టెక్ కంపెనీలలో కూడా ఈ AI కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. పెద్ద ఎత్తున ఉపాధిని అందించిన వ్యవస్థలలో AI సునామీలా మారుతోంది. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి మార్కెట్ రూపురేఖలను ఇది సమూలంగా మారుస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలను AI ప్రభావితం చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
రాబోయే రోజుల్లో AI సేవా మరియు మార్కెటింగ్ రంగాలలోకి మరింత సమర్థవంతంగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. దీనితో, ప్రధాన విశ్వవిద్యాలయాలు కూడా భవిష్యత్తుకు అవసరమైన విధంగా AI కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. AI అంటే భవిష్యత్తు అని నిర్ణయించుకున్న వారు ఆ కోర్సుల్లో చేరుతున్నారు.
Related Posts
AI కంపెనీలు కొత్త ఆవిష్కరణలతో ముందంజ వేస్తున్నాయి. తయారీ రంగం నుండి మార్కెటింగ్ వరకు AI పరిధి విస్తరించింది. AI ఆధారిత జ్ఞానం ఇప్పుడు యువతకు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి తప్పనిసరి అవుతోంది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో AI ఆధారిత సేవలను పెంచడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
ఇటీవల, AP ప్రభుత్వం APలో విద్యా రంగంలో AI సాధనాల వినియోగం కోసం టోనీ బ్లెయిర్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అమరావతి కేంద్రంగా AI విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన కళాశాలల్లో AI కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇప్పుడు AI యుగంలో రాణించడానికి మనం సిద్ధంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. దీనితో, రాబోయే రోజుల్లో ఉద్యోగం కావాలంటే AI తప్పనిసరి కావడం ఖాయంగా కనిపిస్తోంది.