మొదటి పెళ్లి అల్లా చెడిపోయింది.. అతను మోసం చేసాడు .. సన్నీ లియోన్

సన్నీలియోన్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు.. పోర్న్ స్టార్ గా ప్రపంచం మొత్తానికి తెలిసిన స్టార్. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశాడని బాలీవుడ్ నటి సన్నీలియోన్ వెల్లడించింది. ఆ సమయంలో తనకు చాలా బాధగా ఉందన్నారు. “నాకు గతంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఆ క్షణంలో ఏదో తప్పు జరిగిందని నాకు అనిపించింది. చివరకు నేను అనుకున్నది జరిగింది. అతను నన్ను మోసం చేశాడు. “నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?” అని అడగగా అతను వలేదు అన్నాడు. ఇది నాకు బాధ కలిగించింది. 

అంతా సిద్ధమై రెండు నెలల్లో పెళ్లి జరగబోతోంది.. ఆ తర్వాత దేవుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు.. డేనియల్ వెబర్‌ని పరిచయం చేశాడు.. నా తల్లితండ్రులు చనిపోయాక అండగా నిలిచాడు.. మనస్ఫూర్తిగా కలిశాం.. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం.. దేవుడు మా కోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి ఇచ్చారు . ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బెస్ట్‌ని అందుకుంటారు ” అని సన్నీ లియోన్ అన్నారు.

హిందీలో ఎన్నో కార్యక్రమాలు, సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది సన్నీలియోన్. ‘కరెంట్ తీగ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘రంగీలా’, ‘వీరమాదేవి’, ‘కొటేషన్‌ గ్యాంగ్‌’, ‘షీరో’, ‘కోకాకోలా’, ‘యూఐ’ చిత్రాలకు పని చేస్తున్నారు. ఆమె 2011లో డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుంది.