
భారతదేశంలో ఇప్పుడు ఏ మూలకు వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నారు. టీనేజ్ వయసులోని అబ్బాయిలు, అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఎన్నో సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ (పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన విషయాలు) ఎక్కువైపోయింది. దాన్ని చూస్తున్న వారి పసి మనసుల్ని మార్చేసి, అడల్ట్ ప్రపంచం వైపు అడుగులేసేలా చేస్తున్నాయి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇదే ధోరణి కనిపిస్తోంది. అప్పటి వరకు పద్ధతిగా ఉన్న దుస్తుల సంస్కృతి మారిపోతోంది.
జుట్టు స్టైల్ మారుతుంది. స్టైలిష్ బట్టలు వేసుకుని ఫోజులు కొట్టాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు మెల్లిమెల్లిగా డీసెంట్ కల్చర్ (మర్యాదపూర్వక సంస్కృతి)ను వదిలేసి ఛప్రీ కల్చర్ (అమర్యాదకరమైన, నిర్లక్ష్యపు పోకడ) లోకి వచ్చేస్తున్నారు. అమ్మాయిలను పడేయాలనే ఆలోచనలు అబ్బాయిలకు పెరుగుతున్నాయి. అబ్బాయిలతో చాటింగ్ చేయాలనే ఆలోచనలు అమ్మాయిలకు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇన్‌స్టాగ్రామే నేర్పిస్తోంది. టీనేజ్‌కు రాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీలు క్రియేట్ చేసుకుని అందులో వచ్చే చెత్త కంటెంట్ చూస్తున్నారు. ఆ కంటెంట్‌లో ఎక్కువగా అడల్ట్, లవ్ అనే రీల్స్ (చిన్న వీడియోలు) ఎక్కువగా వస్తున్నాయి.
పైగా, ఈ మధ్య టీనేజ్ జంటలు కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఎలా చెడిపోవాలో దగ్గరుండి చూపిస్తున్నాయి. ఆ టీనేజ్ లవ్ జంటలను చూసి తమకు కూడా ఒక లవర్ ఉంటే బాగుండే అనే ఆలోచన అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఎక్కువ అవుతోంది. ఇంకేముంది, స్కూల్లో, కాలేజీలో ఏదో ఒక అమ్మాయిని పడేయాలని టీనేజ్ కుర్రాళ్లు నానా తంటాలు పడటం మొదలైపోతోంది. ఒకప్పుడు అంటే ఫోన్లు లేవు. ఒకవేళ ఉన్నా సరే నంబర్లు తెలుసుకోవడం చాలా కష్టం.
[news_related_post]కానీ ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటున్నాయి కదా. ఇంకేముంది, ఐడీలు సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టేయడం… అటు నుంచి అమ్మాయి కూడా ‘వీడేదో నేనంటే పడి చస్తున్నాడే’ అని మురిసిపోయి ఓకే చేసేయడం… ఇంకేముంది నిబ్బా-నిబ్బి (టీనేజ్ లవర్స్‌ను సూచించే ఒక సాధారణ పదం) లవ్ స్టోరీ స్టార్ట్. కుర్రాడు కాస్త స్టైల్‌గా బైక్ నడిపినా సరే టీనేజ్ అమ్మాయిలు ‘వావ్’ అనుకుని మురిసిపోవడం. ‘హాయ్… బుజ్జి, బంగారం’ అనగానే ‘వీడికంటే నన్ను ఇంకెవడూ బాగా చూసుకోడు’ అని టీనేజ్ అమ్మాయిలు ఊహించేసుకోవడం.
వాడి కోసం ఏం చేయడానికైనా అమ్మాయిలు సిద్ధమైపోవడం. ఇంకేముంది, అటు ఆ నిబ్బాగాడు ఇటు ఈ నిబ్బి చదువులు పక్కనపెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌లు… బేకరీల్లో మీటింగ్‌లు. ఈ మధ్య థియేటర్లకు వెళ్లి సినిమాలు కూడా చూసేస్తున్నారు మన నిబ్బా-నిబ్బి జంటలు. హైస్కూల్ నుంచే చెడిపోవడం మొదలైపోతోంది. ఇదంతా వాళ్ళ వయసు ప్రభావమే. బాధ్యతలు తెలియని, చెబితే వినని వయసు. త్వరగా చెడిపోయే ఏజ్ అది. అందుకే మీ పిల్లలను ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అంటున్నారు ఇప్పటికే చెడిపోయిన పిల్లల తల్లిదండ్రులు.