
BSNL 400 Plan: రూ.400కే 400GB డేటా.. ఆఫర్ కేవలం 4 రోజులే!
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు, జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది.
[news_related_post]అంటే, 1GB డేటా కేవలం రూ.1కి లభిస్తుందన్నమాట. ఇది హై-స్పీడ్ 4G డేటా కాగా, దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌కు సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. ఈ ప్లాన్‌ను BSNL అధికారిక వెబ్సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 90,000 4G టవర్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నెట్వర్క్ విస్తరణ, సామర్థ్యం మెరుగుపడతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. అతి త్వరలో మరో లక్ష 4G/5G టవర్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ అనుమతికి వేచి చూస్తోంది. అయితే, ప్రైవేట్ టెలికామ్ కంపెనీలైన జియో, ఎయిర్టెల్, Viలతో పోటీలో నిలవాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది.