Makhana: వేసవిలో పాలు + మఖానా కాంబినేషన్ తింటే జరిగే అద్భుతాలు… మీకు తెలుసా?…

వేసవి కాలంలో శరీరానికి శాంతి కలిగించే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండలు ఎక్కువగా ఉంటే, శరీరం వేడెక్కుతుంది. అప్పుడు కూలింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అలాంటి సమయాల్లో మఖానా అనే ఆహారం మనకు మంచి మిత్రుడిగా మారుతుంది. ఇది ‘ఫాక్స్ నట్‌’ అనే పేరుతో కూడా పాపులర్‌. ముఖ్యంగా, పాలలో మఖానా కలిపి తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఈ కాంబినేషన్‌ను మిస్ అయితే మిస్సయిపోయినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మఖానాలో ఉన్న శక్తివంతమైన పోషకాలు

మఖానాలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌, ప్రోటీన్‌, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడతాయి. మఖానా తినడం వల్ల ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలోని హీట్ తగ్గుతుంది. వేసవిలో ఎక్కువ శాతం ప్రజలకు తలనొప్పులు, జీర్ణ సమస్యలు, నీరసం వంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ తగ్గించడంలో మఖానా సహాయపడుతుంది.

మఖానాను ఇలా తింటే రెట్టింపు లాభాలు

మఖానాను సాధారణంగా దోరగా వేయించి తింటారు. కానీ పాలలో నానబెట్టి తినటం వల్ల రెండు లాభాలు వస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్‌, కాల్షియం మఖానాలో ఉండే ఫైబర్‌తో కలిపి శరీరానికి పూర్తి పోషణ ఇస్తుంది. ఈ కాంబినేషన్‌ ‘సూపర్ ఫుడ్‌’గా పరిగణించబడుతుంది. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

జీర్ణక్రియ బాగుంటుంది – కడుపు సమస్యలకు చెక్‌

వేసవిలో ఎక్కువ మంది జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. హీటింగ్ ఫుడ్ తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. కానీ మఖానా పాలతో కలిపి తినటం వల్ల ఫైబర్‌ అధికంగా అందుతుంది. ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కడుపులో ఏర్పడే సమస్యల్ని తగ్గిస్తుంది. కడుపు పొట్టిగా ఉండాలనుకునే వారు దీన్ని రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గుండె ఆరోగ్యానికి బంపర్ బెనిఫిట్‌

మఖానా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇది డయాబెటిక్ వ్యక్తులకు చాలా మంచిది. మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కంట్రోల్ చేసి హార్ట్‌పై వచ్చే అదనపు ప్రెషర్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల హార్ట్‌ హెల్త్ బాగా మెరుగవుతుంది. వేసవిలో గుండెపోటులు అధికంగా ఉంటాయని అందరికీ తెలుసు కదా! అలాంటి సమయాల్లో గుండెను కాపాడుకోవాలంటే మఖానా తోడు కావాలి.

ఎముకల బలం కోసం ఇదే బెస్ట్‌

పాలు, మఖానా రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. శరీరానికి రోజూ కావాల్సిన కాల్షియం సరిపడే మోతాదులో అందుతుంది. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండాలంటే దీనిని ఆహారంలో చేర్చుకోవడం అవసరం. వయసు పెరిగేకొద్దీ ఎముకల బలహీనత ఎక్కువవుతుంది. అలాంటి సమస్యలు ముందే నివారించాలంటే మఖానా + పాల కాంబినేషన్‌ తప్పనిసరి.

చర్మానికి యవ్వన కాంతి – నిద్రకు సహాయం

మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. రోజూ పాలలో మఖానా నానబెట్టి తింటే ఒత్తిడి తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది. మీరు నిద్ర బాగోలేదని ఫీల్ అవుతుంటే ఇది అద్భుతమైన సహాయం చేస్తుంది. అంతేకాదు… చర్మానికి కూడా శోభను ఇస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

మఖానా పాలలో తినడం ఎలా?

ఒక గ్లాస్ పాలను మరిగించి నంచి, కొద్దిగా చల్లారిన తర్వాత అందులో మఖానా వేసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. అవసరమైతే తేనె కొద్దిగా కలిపినా మేలు చేస్తుంది. దీనివల్ల రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

వేసవిలో శరీరానికి శక్తి ఇచ్చే సూపర్ డ్రింక్‌

వేసవిలో నీరసం రావడం, ఒత్తిడి ఎక్కువవడం వంటి సమస్యలు సాధారణం. కానీ మఖానా పాలతో తీసుకుంటే అదనపు శక్తి లభిస్తుంది. ఇది రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వారు, గృహిణులు, ఉద్యోగస్తులు, వృద్ధులు – అందరికీ ఇది వరం లాంటి ఆహారం.

చివరగా…

పాలు + మఖానా కాంబినేషన్‌ వేసవిలో ఒక బంగారు అవకాశం. దీనిని తినడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్‌, ప్రోటీన్ అన్నీ ఒకే సారి అందుతాయి. వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచాలంటే, జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా ఉంచాలంటే, గుండెను రక్షించుకోవాలంటే… మీరు ఈ కాంబినేషన్‌ను మిస్ కాకండి.

ఈ వేసవిని ఆరోగ్యంగా గడపాలంటే – ఈ మఖానా + పాల మిక్స్‌ ఇప్పుడు నుంచే మొదలెట్టండి. ఆరోగ్యాన్ని కోల్పోయే ముందు… ఆరోగ్యాన్ని అక్కున చేర్చుకోండి!