వేసవి వేడి రోజురోజుకూ భరించలేనంతగా పెరుగుతోంది. రాత్రివేళ నిద్రపోవడం కూడా కష్టంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో మంచి AC ఉండటం చాలా అవసరం. కానీ అధిక ధరలతో కాదు, తక్కువ ధరలో మంచి పనితీరు కలిగిన AC కావాలి.
అందుకే ఇప్పుడు మనం చెప్పబోయే ACలు రూ.35,000లోపు లభిస్తున్నాయి. ఇవి కేవలం చల్లదనం మాత్రమే కాకుండా, ఇంటెలిజెంట్ ఫీచర్లు, పవర్ సేవింగ్ టెక్నాలజీ, సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ వంటివి కూడా కలిగి ఉన్నాయి.
ఇందులో Haier, Voltas, Lloyd వంటి ప్రఖ్యాత బ్రాండ్లు ఉన్నాయి. ఇవి 1.5 టన్, 3 స్టార్ రేటింగ్ కలిగిన ఇన్వర్టర్ స్ప్లిట్ ACలు. వేసవి కాలంలో మీ ఇంటిని కూల్‌గా ఉంచే మంచి ఎంపికలివి.
Related News
ఈ సీజన్‌కి తగ్గట్టు భారీ డిస్కౌంట్లతో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో లభ్యమవుతున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఏ AC మీ ఇంటికి బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Haier 1.5 Ton 3 Star Twin Inverter Split AC – ఇంటెలిజెంట్ కూలింగ్‌తో ఉత్తమ ఎంపిక
Haier బ్రాండ్ AC గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో Twin Inverter Compressor ఉంటుంది. ఇది మీ గదిలో ఉన్న వేడిని బట్టి పవర్‌ను సర్దుబాటు చేస్తుంది. అంటే అవసరానికి తగినంతగా మాత్రమే పవర్ వినియోగిస్తుంది. ఈ ACలో 7-in-1 కన్వర్టబుల్ మోడ్ ఉంది. దీని ద్వారా మీరు 40 శాతం నుంచి 110 శాతం వరకు కూలింగ్‌ను మార్చుకోవచ్చు.
బయట 54 డిగ్రీల వేడి ఉన్నా కూడా ఇది శక్తివంతమైన చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ వల్ల ACలో బ్యాక్టీరియా, చెత్త వాసన 21 నిమిషాల్లో తొలగిపోతాయి. 100 శాతం కాపర్ కండెన్సర్, హైపర్ PCBతో పవర్ సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
అతి తక్కువ శబ్దంతో పని చేస్తుంది. అలాగే ECO మోడ్, లాంగ్ ఎయిర్ త్రో, క్వయిట్ ఆపరేషన్ వంటి ఫీచర్లతో పాటు 12 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది డైలీ వాడకానికి బాగా సరిపోతుంది.
Voltas 1.5 Ton 3 Star Inverter Split AC – సింపుల్ డిజైన్‌లో శక్తివంతమైన పనితీరు
Voltas ఎయిర్ కండిషనర్లు విశ్వసనీయతకు పేరుగాంచినవి. ఇందులో 4-in-1 అడ్జస్టబుల్ మోడ్ ఉంది. దీని వలన మీరు మీ అవసరాన్ని బట్టి కూలింగ్‌ను మార్చుకోవచ్చు. ఇది 52 డిగ్రీల వేడి వరకు కూడా సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది గాలిలోని ధూళి, మలినాలను తీయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా కాపర్ కండెన్సర్‌తో తయారయ్యింది. దీని వలన దీర్ఘకాలికంగా మేంటెనెన్స్ తక్కువగా ఉంటుంది. శక్తి వినియోగాన్ని తగ్గించడంలో ఇది చాలా మంచి ఎంపిక.
మీ ఇంట్లో మధ్యస్థ గదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. స్లిమ్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీతో వేసవిలో ఎక్కువ మంది ఈ ACనే ఎంచుకుంటున్నారు.
Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC – కూలింగ్‌తో పాటు ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా
Lloyd ACలో 5-in-1 కన్వర్టబుల్ మోడ్ ఉంది. ఇది గది పరిస్థితులను బట్టి 30 శాతం నుంచి 110 శాతం వరకు కూలింగ్ మారుస్తుంది. 52 డిగ్రీల టెంపరేచర్‌లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో Blue Fin Evaporator Coils ఉన్నాయి. ఇవి తడి, తేమ వలన కలిగే తుప్పు నుంచి రక్షిస్తాయి.
ఈ ACలో PM 2.5 ఫిల్టర్, యాంటీవైరల్ లేయర్ ఉన్నాయి. ఇవి గాలిని స్వచ్ఛంగా ఉంచడంలో సహాయపడతాయి. Turbo Cool, Auto Restart, Low Gas Detection, Clean Filter Indicator వంటి ఫీచర్లు ఉన్నాయంటే మింటెనెన్స్ కూడా సులభంగా ఉంటుంది. దీని డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. LED డిస్‌ప్లే, నిశ్శబ్దంగా పనిచేసే మోటార్, క్రోమ్ ఫినిష్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
ఇక మీరు ఎంచుకోవాల్సింది ఏది?
Haier ACలో ఉండే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, వేగంగా కూలింగ్ చేసే సామర్థ్యం చూస్తే ఇది టాప్ క్లాస్ ఎంపిక. Voltas AC సింపుల్ డిజైన్‌లో పవర్‌ఫుల్ పనితీరుతో ఆకట్టుకుంటుంది. Lloyd AC అయితే కూలింగ్‌తో పాటు గాలిని శుభ్రపరిచే టెక్నాలజీతో వస్తుంది.
ఇవన్నీ ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ టైం పూర్తయ్యాక మళ్లీ ఇంత తక్కువ ధరకు ఇవి దొరకవు. అందుకే వేసవిని చల్లగా మార్చుకునేందుకు ఇది బెస్ట్ ఛాన్స్.
AC కొనాలని ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఏ ఫోన్‌ను తీసుకోవాలన్న ప్లాన్ కంటే, వేసవిలో AC తీసుకోవడమే ఇప్పుడు అవసరం.