కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్‌పై క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 2025లోనే కొత్త పే కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఈ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్ 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది.
ఫైనల్ రిపోర్ట్ వస్తే జీతాలూ భారీగా పెరుగుతాయా?
కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత దాదాపు 15 నుంచి 18 నెలల్లో వారు తమ నివేదికను సమర్పించే అవకాశముంది. అంటే 2026 ఏప్రిల్ లేక మే కల్లా సిఫార్సులు ఇవ్వవచ్చు. కానీ ఫైనల్ అమలు మాత్రం 2027 వరకూ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా చాలా మందిలో డౌట్ – ఇప్పటి డీఏ (Dearness Allowance) బేసిక్ జీతంలో కలుపుతారా లేక విడిగా ఉంచుతారా అన్నది. ఇక కొత్త కమిషన్ కింద డీఏ లెక్కించడానికి బేస్ ఇయర్ మార్చే అవకాశం కూడా ఉంది.
డీఏ లెక్కల్లో మార్పులు వస్తాయా?
ప్రస్తుతం డీఏను AICPI-IW అనే ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తున్నారు. ఇది మొదటి పే కమిషన్ నుంచే వస్తున్న పద్ధతే. 7వ పే కమిషన్ సమయంలో 2016ని బేస్ ఇయర్‌గా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ 8వ పే కమిషన్‌లో కొత్త బేస్ ఇయర్ తీసుకునే అవకాశముంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో కొత్త బేస్ ఇయర్ అవసరమే అంటున్నారు నిపుణులు.
Related News
జీతాలపై కొత్త ప్రభావం ఎలా ఉంటుందంటే
2026లో 8వ పే కమిషన్ అమలులోకి వస్తే, అప్పటివరకు డీఏ శాతం దాదాపు 61% చేరే ఛాన్స్ ఉంది. ఇది కొత్త బేసిక్ జీతంలో కలిపే అవకాశం ఉంది. ఇది జరిగితే జీతాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల ఉంటుందన్న మాట. అయితే డీఏ పూర్తిగా కలిపితే అది సున్నాకి చేరుతుంది. ఆ తర్వాత మళ్లీ కొత్తగా డీఏ లెక్కిస్తారు. ఇదే 2016లో 125% డీఏని బేసిక్‌లో కలిపినట్లు.
పాత వేతన ప్రణాళిక మార్పు ఎలా జరిగింది?
6వ పే కమిషన్ వరకు జీతం “పే బాండ్ + గ్రేడ్ పే” అనే రెండు భాగాలుగా ఉండేది. 7వ కమిషన్ ఈ రెండింటినీ కలిపి “బేసిక్ పే”గా ఒకే రూపంలో తీసుకువచ్చింది. అప్పుడు 125% డీఏను బేసిక్‌లో కలిపి కొత్త జీతాన్ని లెక్కించేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో డీఏని బేసిక్‌లో కలపడం ద్వారా ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఈ సమాచారం మీ భవిష్యత్ జీతాన్ని నిర్ణయించవచ్చు. డీఏ లెక్కలు మారితే లేదా బేసిక్ పెరిగితే, మీ జీతం రూ.10,000 – రూ.12,000 వరకూ పెరగొచ్చు. ఇప్పటినుంచే ఈ మార్పులను ఫాలో అవుతూ అప్డేట్‌గా ఉండాలి. లేకపోతే నష్టమవుతుందనే మాట స్పష్టంగా చెప్పవచ్చు.