ఏపీ పాలీసెట్-2025కు సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. పాలీసెట్-2025 పరీక్షకు దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దరఖాస్తు రుసుము OC/BC అభ్యర్థులకు రూ. 400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేస్తూ, పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశిస్తున్నారు.
AP POLYCET: బిగ్ అలర్ట్.. ఆ రోజునే ఏపీ పాలీసెట్ పరీక్ష..!!

21
Feb