SSMB29: రాజమౌళి దర్శకత్వం వహించిన SSMB29 చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. సినిమా గురించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు.
సెట్స్ నుండి ఎటువంటి వార్తలు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, రాజమౌళి ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి, కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల, ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదని వార్తలు వచ్చాయి. దీనితో, ఇప్పటివరకు మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఆమె కనిపిస్తుందని ఫిక్స్ అయిన వారందరూ ఇది మళ్ళీ ట్విస్ట్ అని షాక్ అయ్యారు.
SSMB29 గురించి రాజమౌళి ఇంకా పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ ఇంకా జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ అని మొదటి నుండి ప్రచారం జరిగింది. ఇటీవల, ప్రియాంక హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంత చర్చ జరుగుతున్నా, రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు చెప్పడం లేదు.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు వినిపించింది. అలాంటిదేమీ లేదని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే, అందరూ అనుకున్నట్లుగా ప్రియాంక హీరోయిన్ కాదు. ఈ చిత్రంలో ఆమె లేడీ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దాని కోసం లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త లీక్ అప్‌డేట్‌తో, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న మరోసారి చర్చకు దారితీసింది. అయితే, హాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని మూవీ టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.