Budget 2025: ఆర్థిక మంత్రి Nirmala Sitharaman కొత్త పన్ను విధానం లో కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. తద్వారా పన్ను కట్టే వారికి మరింత పన్ను బెనిఫిట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో టాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడమా? లేక పాత పన్ను విధానంలో కొనసాగడమా? అన్న అనుమానం లో ఉన్నారు ?
కొత్త పన్ను విధానం మంచిదా.. లేక పాత పన్ను విధానమా ! ఇప్పుడు ఏది బెటర్?
Budget 2025: ఆదాయపు పన్ను శ్లాబులు మరింత లాభదాయకం గా మారడంతో, టాక్స్ పేయర్స్ కు ఇప్పుడు పాత పన్ను విధానం కంటే కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది గా కనిపిస్తోంది. ఈ రోజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగంలో కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. ఇవి టాక్స్ పేయర్స్ కు ఎక్కువ పన్ను ఆదాను అందిస్తాయి.
Related News
టాక్స్ లో తేడా ఎంత?
ఏడాదికి రూ.12 లక్షల వరకు వేతనం పొందే శాలరీ పర్సన్స్ కొత్త పన్ను విధానంలో ఎలాంటి ఆదాయపు పన్ను చెలించనవసరం లేదు. శాలరీ పర్సన్స్ కి రూ.75,000 SD ఉన్నందున రూ.12.75 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు.
మీ ఆదాయం రూ.12.75 లక్షలు అయితే, కొత్త పన్ను విధానంలో మీరు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను సున్నా. అదే సమయంలో, మీరు పాత పన్ను విధానంచూసుకుంటే , మీ ఆదాయ పన్ను రూ.1.8 లక్షలు గా ఉంది
మీ ఆదాయం రూ.15.75 లక్షలు ఉంటే కొత్త పన్ను విధానంలో మీ టాక్స్ రూ.1.05 లక్షలు కాగా, పాత విధానంలో మీ టాక్స్ భారం రూ.2.7 లక్షలకు పెరుగుతుంది.
చివరగా, మీ ఇన్కమ్ రూ .25.75 లక్షలు అయితే, కొత్త విధానంలో మీ పన్ను భారం రూ .3.3 లక్షలు, పాత విధానంలో అయితే రూ .5.7 లక్షలు.
పాత విధానంలో పన్ను శ్లాబులు
- 0-2.5 lakh – NIL
- 2.5 to 5 lakh – 5% above – 2.5 lakh
- 5 lakh to 10 lakh 12.5K + 20% above- 5 lakh
- Above 10 lakh – 1,12,500 + 30 percent above – ₹10 lakh
కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబులు
- 0-4 lakh – Nil
- 4-8 lakh – 5 per cent
- 8-12 lakh – 10 per cent
- 12-16 lakh – 15 per cent
- 16-20 lakh – 20 per cent
- 20- 24 lakh – 25 per cent
- Above 24 lakh – 30 per cent
నిపుణులు సలహా ఏమిటంటే ?
పాత, కొత్త పన్ను విధానం మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, పాత విధానంలో పన్ను చెల్లింపుదారులు PPF, NSP, INSURANCE ప్రీమియం, NPS వంటి వివిధ సేవింగ్స్ కు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది . కొత్త పన్ను విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. . కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహా, కొత్త పన్ను విధానం ఇప్పుడు ఎక్కువ టాక్స్ సేవింగ్ ఇస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.