ఇంజనీరింగ్ మరియు డిప్లొమాలో చేరాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను అందిస్తుంది. ఇంజనీరింగ్ కేవలం కంప్యూటర్ సైన్స్‌గా మారినందున, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇది స్కాలర్షిప్లను మంజూరు చేస్తుంది.
సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కెమికల్ బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమాలో చేరే విద్యార్థుల కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గత సంవత్సరం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ మరియు హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ (YASV) అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత
Related News
AICTE గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో డిప్లొమా లేదా బి.టెక్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.
సంబంధిత కోర్సులో మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం లాటరల్ ఎంట్రీలో చేరిన వారు మాత్రమే ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించకూడదు. సంబంధిత సర్టిఫికెట్లు జతచేయాలి.
సంవత్సరానికి రూ. 50 వేలు
ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ. 50 వేలు అందిస్తారు. డిప్లొమా విద్యార్థులకు మూడు సంవత్సరాలు స్కాలర్షిప్ మరియు ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న వారికి నాలుగు సంవత్సరాలు స్కాలర్షిప్ అందించబడుతుంది.
ఇంజనీరింగ్ విద్యార్థులు: సంవత్సరానికి రూ. 50,000 (మొత్తం 4 సంవత్సరాలు లేదా లాటరల్ ఎంట్రీకి 3 సంవత్సరాలు).
డిప్లొమా విద్యార్థులు: రూ. 30,000 (మొత్తం 3 సంవత్సరాలు లేదా లాటరల్ ఎంట్రీకి 2 సంవత్సరాలు).
దరఖాస్తు చేసుకునే విధానం
AICTE స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రమాణాలు
డిప్లొమా అభ్యర్థులను 10వ తరగతిలో పొందిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందిన వారిని ఇంటర్లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని వివరాల కోసం, AICTE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.