అమెజాన్ సూపర్ డీల్.. ఈ వన్ ప్లస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్!

అమెజాన్ ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రధానంగా.. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అదే తరహాలో వన్‌ప్లస్ మొబైల్ ప్రియులకు ఇష్టమైన ఫోన్ ధరను కూడా తగ్గించింది. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 4 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో తయారు చేయబడింది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్‌లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆఫర్లు

వన్‌ప్లస్ నార్డ్ సిఇ 4 లైట్ 5జి ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 19,999 ధరకు ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం అమెజాన్‌లో 14 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ మొబైల్‌ను రూ. 17,998కి ఆర్డర్ చేయవచ్చు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లింపులపై అదనంగా 2,000 డిస్కౌంట్ ఉంది. దీనితో ఈ ఫోన్ ధర రూ. 15,998కి తగ్గించబడుతుంది. అమెజాన్‌తో పాటు ఈ ఫోన్‌ను అధికారిక వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Related News

ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1080 × 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆక్సిజన్ OS 14పై నడుస్తుంది.

మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో OIS, EISతో 50MP సోనీ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM ఉంది. ఇందులో 8GB వర్చువల్ RAM కూడా ఉంది. ఈ ఫోన్‌లో 256GB స్టోరేజ్ ఉంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.