మీరు ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చినప్పుడు… సర్జరీ జరిగిన రోజు ఉదయం నుండి వైద్యులు మీకు ఎటువంటి ఆహారం ఇవ్వరు. ఆహారం మాత్రమే కాదు.. తినేవి తాగేవి వేటినీ కూడా ముట్టుకోనివ్వరు.
అంతేకాకుండా, సర్జరీ తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. సర్జరీ తర్వాత మీరు ఖచ్చితంగా వంకాయ తినకూడదని వైద్యులు అంటున్నారు. కానీ వారు ఇలా ఎందుకు చెబుతారో తెలుసుకుందాం.
సాధారణంగా, ఏ వైద్యుడైనా శస్త్రచికిత్స చేసే ముందు రోగికి లోకల్ అనస్థీషియా ఇస్తారు. దీని కారణంగా, రోగి మత్హులోకి వెళ్తారు . ఆ సమయంలో, శస్త్రచికిత్స ఎటువంటి నొప్పి లేకుండా నిర్వహిస్తారు. అయితే, ఇలా లోకల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియ దెబ్బతింటుంది. దీని కారణంగా, అన్ని అవయవాలు జీవం లేనట్టు అవుతాయి.
Related News
వెంటనే మళ్ళీ స్పృహ లోకి రావటానికి బాడీ లో అన్ని అవయవాలు పనిచేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో, శరీరంలో హిస్టామిన్లు విడుదలవుతాయి. వాటిని తగ్గించడానికి యాంటిహిస్టామైన్లు ఇస్తారు. అయితే, వంకాయ అనేది హిస్టామిన్ విడుదల చేసే పదార్థం. యాంటిహిస్టామైన్లు తీసుకుంటూ వంకాయ తినడం వాళ్ళ అవి పనిచేయవు . అందుకే శస్త్రచికిత్స సమయంలో వంకాయ తినకూడదని వైద్యులు అంటున్నారు.