Pawan Kalyan: ఏపీకి చిత్ర పరిశ్రమ.. పవన్ కీలక ప్రకటన!

గేమ్ ఛేంజర్ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ కూడా ఉంది. ఇప్పటికే ఏపీలో ఈ చిత్రానికి సంబంధించి మెగా ఈవెంట్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు మెగా ఈవెంట్ జరగనుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మెగా అభిమానులు బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం హాజరవుతున్నందున పోలీసులు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

* మెగాస్టార్ హాజరు?

అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మెగా బ్రదర్స్ హాజరు కానున్న నేపథ్యంలో అభిమానులు భారీగా తరలిరానున్నారు. అందుకే ఈ ఈవెంట్‌ను మెగా ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు. దాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారనేది కీలకంగా మారింది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్.. తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. తర్వాత ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈవెంట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హాజరు అందరి దృష్టిని ఆకర్షించింది.

Related News

* పవన్ ఆ ప్రకటన చేస్తారా?
పవన్ ప్రసంగం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు చేసే ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమను కూడా ఏపీకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ వేదికపై కొన్ని రకాల రాయితీలు ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో.. కష్టాలు, నష్టాలు పూర్తిగా తెలుసుకుని పరిశ్రమకు మేలు చేసేలా ప్రకటనలు చేస్తారని సినీ పరిశ్రమ పెద్దలు ఆశిస్తున్నారు. మరి పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.