మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు మానవ వనరుల శాఖ , ఐటీ, ఎలక్ట్రానిక్, ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ సహకారంతో HCL కంపెనీలో ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు పార్టీ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Eligibility:
Related News
2023 మరియు 2024 విద్యా సంవత్సరంలో, వారు ఇంటర్మీడియట్ వొకేషనల్, CEC, HAC, BIPC లలో 75 % మార్కులతో ఉత్తీర్ణులై, మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
Place of Work: ఏడాది పొడవునా శిక్షణ కాలంలో 3నెలలు మదురైలో, 9 నెలలు చెన్నైలో ఉండాలి.
Stipend:
- మొదటి మూడు నెలల తర్వాత నెలకు రూ.10,000 గౌరవ వేతనం,
- శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదికి కనీసం రూ.70,000 ప్యాకేజీ అందజేస్తారు.
పూర్తి వివరాల కోసం సెల్: 8367608888, 9553910733 నంబర్లలో లేదా మంగళగిరి డాక్టర్ శ్రీమతి MSS భవన్లో సంప్రదించాలని సూచించారు.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఈ పని చేస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు.