Exit polls: ఆ పార్టీని నిండా ముంచేసిన ఆ సర్వేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి గెలుపు ఓటములపై ​​చర్చ జరుగుతోంది. గెలుపు తమదేనని ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ క్రమంలోనే జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ శనివారం వెలువడ్డాయి. ఈ నేప థ్యంలో స్థానిక స ర్వేల తో పాటు జాతీయ స ర్వే సంస్ధ లు కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ స్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వ స్తుంది అనే విష యాల ను కూడా విడుద ల చేశాయి.

ఈ క్రమంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు వైసీపీ గెలుస్తుందని ప్రకటించాయి.

దీంతో జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జాతీయ సర్వేలన్నీ ఎన్డీయే కూటమికి పట్టం కట్టాయి. ఈ క్రమంలోనే ఏపీలోనూ టీడీపీ పొత్తు ఖాయమని లెక్కలు వేసుకుని తమ నివేదికను ఇచ్చినట్లు సమాచారం.

ఎందుకంటే జాతీయ సర్వేలు ఎల్లప్పుడూ వ్యక్తుల నుండి నేరుగా నమూనాలను తీసుకోవు . ఇక్కడ ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ చేస్తారు . అయితే ఆ కాంట్రాక్ట్ ఎవరిని ఎవరు తీసుకున్నారు.. ఎంత మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారనేది మాత్రం వెల్లడించలేదు.

దీంతో జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. రాష్ట్రంలోనూ అదే పార్టీ లేదా తమ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *