Wife Birthday : భార్య పుట్టినరోజును మర్చిపోతే.. జైలుకే! ప్రత్యేక చట్టం అమలు..

మీ ప్రియమైన భార్య పుట్టినరోజు గురించి పట్టించుకోరా? బిజీగా ఉండి కోరికలు తీర్చలేకపోతున్నారా? మీరు మీ భార్య పుట్టినరోజును పూర్తిగా మర్చిపోయారా? కానీ ఇప్పుడు మనం ఊచలు లెక్కపెట్టాల్సిందే. భార్య పుట్టిన రోజు మర్చిపోతే జైలుకు పంపుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భయపడకండి, ఇది మన దేశంలో కాదు.. అమెరికాకు సమీపంలోని పాలినేషియన్ దీవి సమోవా అనే దేశంలో ఈ శిక్ష అమలవుతోంది. ఎవరైనా తన భార్య పుట్టినరోజును పొరపాటుగా మరచిపోతే జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణించబడుతుంది. పుట్టినరోజున భర్త నుండి చిన్న బహుమతి కుడా ఎంతో ఆనందం గా ఉంటుంది కాని పురుషులు పుట్టిన రుఒజుని ఈజీ గా మరిచిపోతారు  .. అనేక పనుల్లోలో  ఉన్నందున మర్చిపోతారు. భార్యలు కూడా ఆ సంగతి  మరిచిపోయి.. సర్దుకుపోతారు. అయితే, సమోవాలో విషయాలు అంత సులభం కాదు.  భార్య పుట్టినరోజు ఇక్కడ మర్చిపోతే, వారు ఎం చేస్తారో చుడండి

సమోవా దేశంలో అక్కడి ప్రభుత్వం దీని మీద ఒక చట్టం చేసింది. పైగా ఈ చట్టం సక్రమంగా అమలవుతుందా? లేదా అనే దానిపై ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోతే.. భర్తకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు.

రెండోసారి కూడా అదే తప్పు చేస్తే జరిమానా లేదా గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్రుతారు . అంతేకాకుండా, భార్యకు ఆమె హక్కులు మరియు ఈ చట్టం గురించి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కూడా ఇలాంటి చట్టం అమలైతే ఒక్కసారి ఆలోచించండి.. జైళ్లన్నీ నిండిపోతాయేమో!