హోమ్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా సడెన్ గా మరణిస్తే?

మన దేశంలో చాలా మంది రుణాలను బట్టి ఇల్లు కొనాలనే తమ కలను నిజం చేసుకుంటున్నారు. కానీ గృహ రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఏమి జరుగుతుంది?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పుడు తెలుసుకుందాం..

గృహ రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు, రుణం చెల్లించే బాధ్యత వారి సహ-దరఖాస్తుదారు (లేదా) వారసులపై పడుతుంది. చట్టబద్ధంగా, వారు మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు మరియు అప్పులను వారసత్వంగా పొందుతారు. ఈ ప్రక్రియలో, వారు ఆ వ్యక్తికి సంబంధించిన బకాయిలు మరియు రుణ మొత్తాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే, రుణం ఇచ్చిన బ్యాంకులు ఇంటిని వేలం వేసే హక్కును పొందుతాయి. ఈ ప్రక్రియ వారసులపై ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది.

Related News

 ఎలా నిరోధించాలి?

బ్యాంకులు ఆస్తి/ఇంటిని ఇలా వేలం వేయకూడదనుకుంటే.. గృహ రుణం తీసుకునే సమయంలో బీమా పాలసీని కూడా ఎంచుకోవాలి. అలా చేయడం ద్వారా, తీసుకున్న రుణ మొత్తానికి పాలసీ భద్రతను అందిస్తుంది. దీని కారణంగా, రుణం తీసుకున్న వ్యక్తి ఊహించని పరిస్థితులలో మరణించినప్పటికీ.. బీమా పాలసీ బకాయి ఉన్న రుణాన్ని కవర్ చేస్తుంది. ఇది ఆ వ్యక్తి వారసులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.