
ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా డబ్బు అవసరం. ఇది నిజం. కానీ అంతటి పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా పెట్టుబడి చేయడం ప్రతి ఒక్కరిదీ కాదు. అలాంటి సమయంలో ప్రభుత్వ మద్దతుతో వచ్చే ఎంఎస్ఎంఈ లోన్స్ చిన్న వ్యాపారాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఈ లోన్లు కలిస్తేనే చాలనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే ఇవి మీ బిజినెస్ అభివృద్ధికి, రోజువారీ ఖర్చులకు, మెషినరీ కొనుగోలు వంటి అవసరాలకు బలమైన సాయంగా నిలుస్తాయి.
ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇవి చిన్న స్థాయి పరిశ్రమలు. దేశ ఆర్థిక వ్యవస్థలో వీటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇవి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయి. నూతన ఆవిష్కరణలకు దారి చూపుతాయి. అలాంటి పరిశ్రమలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా అందించే రుణాలే MSME లోన్లు. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ప్రభుత్వ బ్యాంకులు ఈ రుణాలను సరళమైన విధానంతో అందిస్తున్నాయి. మీరు అర్హులు అయితే తక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో రుణం పొందవచ్చు.
మీరు చిన్న వ్యాపారంలో ఉన్నా, మద్యస్థాయి బిజినెస్ చేసేవారైనా, పండుగ సీజన్లో అదనపు స్టాక్ కొనాలనుకున్నా, లేదా నూతన శాఖ ప్రారంభించాలని అనుకుంటే డబ్బు కావాలి. అదే సమయంలో సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, షాపు అద్దె చెల్లించాలి. ఇవన్నీ సాధ్యమయ్యేలా చేస్తుంది ఎంఎస్ఎంఈ లోన్. ఇది మీ బిజినెస్‌ను నిలబెట్టడమే కాకుండా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
[news_related_post]వెరైటీ అవసరాలకు తగిన విధంగా చాలా రకాల MSME లోన్లు ఉన్నాయి. దీని వల్ల మీ వ్యాపారానికి ఏ అవసరమైనా సరిపోతుంది. మీరు యంత్రాలు కొనాలనుకుంటే దానికి ఒక లోన్ ఉంది. రోజువారీ ఖర్చుల కోసం మరొకటి ఉంది. మొత్తానికి, అవసరాన్ని బట్టి రుణం ఎంచుకోవచ్చు.
టర్మ్ లోన్ అనేది ఒక లాంగ్‌టర్మ్ లోన్. దీన్ని మీరు మెషిన్లు కొనుగోలు చేయడానికి, బిజినెస్‌ను విస్తరించడానికి వాడుకోవచ్చు. ఫిక్స్డ్ కాలానికి ఈ లోన్ ఉంటుంది. ప్రతినెలా EMI రూపంలో తిరిగి చెల్లించాలి.
వర్కింగ్ కాపిటల్ లోన్ అనేది రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా జీతాలు, అద్దెలు, స్టాక్ కొనుగోలు లాంటి అవసరాలు తీర్చవచ్చు. కాష్ఫ్లోలో ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది.
ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ అనేది యంత్రాలు కొనడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమవుతుంది. ఇందులో కొనుగోలు చేసే మెషిన్‌ను గిరవుగా పెట్టి రుణం తీసుకోవచ్చు.
బిజినెస్ క్రెడిట్ కార్డు కూడా చిన్న వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. దీనితో చిన్న ఖర్చులు సులభంగా చేయవచ్చు. తిరిగి తిరిగి చెల్లించవచ్చు. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఇది ఓ మంచి ఆప్షన్.
ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా మీరు మీ అకౌంట్లో ఉన్నంతకన్నా ఎక్కువ డబ్బు వాడుకోవచ్చు. ఇది తాత్కాలికంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు ఉపశమనం ఇస్తుంది.
ఎంఎస్ఎంఈ లోన్‌కు అప్లై చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇవి మీరు వ్యాపారం చేస్తున్నట్టు నిరూపించేందుకు, మీ ఆర్థిక స్థితి చూపించేందుకు ఉపయోగపడతాయి.
మీ వ్యాపారానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇది MSME రిజిస్ట్రేషన్‌కి అవసరం. అంతేకాక బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. మీ బిజినెస్ ఎలా నడుస్తుందో తెలియడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, GST రిటర్న్‌లు ఇవ్వాలి. వ్యక్తిగత ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు మీ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే బిజినెస్ ప్లాన్ కూడా అడగొచ్చు.
మీరు చిన్న వ్యాపారవేత్త అయితే, ఎంఎస్ఎంఈ లోన్ ద్వారా మీరు మంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. సరైన రుణాన్ని ఎంచుకొని, అవసరమైన డాక్యుమెంట్లతో అప్లై చేస్తే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఉపశమనలు, సబ్సిడీలు కూడా తీసుకుంటే మీ వ్యాపారం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. డబ్బు లేనంత మాత్రాన వ్యాపారాన్ని ఆపేయకండి. MSME లోన్ తో మీ కలలను సాకారం చేసుకోండి.