Weekly Horoscope: ఉద్యోగాలలో వీరి మాటకు తిరుగుండదు.. మీ రాశి ఇదేనా..!

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అనేక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. శుభ ఎక్కువగా వీనే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కొన్ని ముఖ్యమైన, వ్యవహారాలు, పనులను, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త అవకాశాలు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన పనులను, పనులను నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. సరైన ప్రయత్నంతో పాటు, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబపరమైన ఒత్తిడి నుంచి బయటపడింది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుమి, ఆశ్లేష): ఉద్యోగంలో అదనపు పనిభారం నిదానంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మితిమీరిన ఔదార్యాలను కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి ఇబ్బందులుండే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొంత పురోగతి సాధిస్తాయి. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొన్ని ప్రయత్నాలు, పనులు, బాగా నిదానంగా ముందుకు సాగుతాయి. బంధువులు ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి తెచ్చే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కొందరు మిత్రులు కూడా లేనిపోని తగాదాలకు దిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒకటి రెండు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండటం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభం పొందుతారు. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు మరింత పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వస్త్రాభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఆశించిన ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు దిగ్విజ యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితికి అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్న నాటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల సహాయంతో ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను సవ్యంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆశించిన శుభ అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కానీ, సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితముంటుంది. కష్టార్జితాన్ని ఇతరుల మీద వృథా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వృత్తి, ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో ప్రాముఖ్యత, ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. అధికార యోగం పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఎక్కువగా నష్టాల నుంచి బయటపడతాయి. లాభాల బాటలో పయనిస్తారు. తండ్రి కుటుంబం నుంచి స్వల్ప ఆస్తి లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం అనేక విధాలుగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఇతరులకు ప్రయోజనం చేకూర్చే పనులు మీరు చేస్తారు. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల మీకు లాభాలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతినదు. నిరుద్యోగుల ప్రయత్నాలు కుదుటపడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అనవసరమైన సహాయం తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారం స్థిరంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో మీకు సన్నిహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి మరియు స్నేహం పెరుగుతుంది. నిరుద్యోగులు తిరిగి కలిసే సమయం ఇది. మీరు చిన్ననాటి స్నేహితులతో విందులు మరియు వినోదాలలో పాల్గొంటారు. మీ ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా ధనిక కుటుంబంలో వివాహం చేసుకునే అవకాశం ఉంది.

కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు చేయకపోవడమే మంచిది. కెరీర్ మరియు ఉద్యోగాలలో బాధ్యతలు మరియు లక్ష్యాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఓర్పు మరియు సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన ఆర్థిక మరియు ఆస్తి విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల పనిపై దృష్టి పెట్టకుండా మీ స్వంత పనిపై దృష్టి పెట్టడం అవసరం. తోబుట్టువులతో రియల్ ఎస్టేట్ వివాదాలు పరిష్కారం వైపు కదులుతాయి. మీ నుండి సహాయం పొందిన వారు ముఖం చిట్లిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు స్వల్ప లాభాలను ఆర్జిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సజావుగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహం జరిగే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆధ్యాత్మిక విషయాలతో పాటు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలపై కూడా మీరు చాలా శ్రద్ధ చూపుతారు. ప్రతి విషయంలోనూ చాలా శుభం ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో మరియు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మీరు పనిలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా పూర్తవుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఉంటాయి. మొండి అప్పులు వసూలు అవుతాయి.