తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డు అప్లికేషన్లు మొదలు అయ్యాయి. ఇప్పటివరకు మీరు అప్లై చేయకుంటే త్వరగా ఈ డాక్యుమెంట్ల ద్వారా అప్లై చేయండి. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించండి.
తెలంగాణ రేషన్ కార్డు 2025 గురించి
రేషన్ కార్డు అనేది తెలంగాణ రాష్ట్ర పౌరులకు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ పత్రం. కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ ద్వారా జారీ చేయబడుతుంది. ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఈ కార్డు ను ఉపయోగిస్తుంది.
రేషన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ
1. జనవరి 16, 2025 నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రేషన్ కార్డుల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభించింది.
2. హైదరాబాద్ ఇన్-చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు & బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రకారం, ఈ ఇంటింటి సర్వే ద్వారా కొత్త లబ్ధిదారులను గుర్తించనున్నారు.
Related News
అర్హతలు
- తెలంగాణ రాష్ట్ర పౌరుడు అయి ఉండాలి
- ఇప్పటికే రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) ఉండకూడదు
- ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి
- కొత్తగా పెళ్లైన దంపతులు దరఖాస్తు చేసుకోవచ్చు
- గడువు ముగిసిన రేషన్ కార్డుల లేదా తాత్కాలిక కార్డుల స్థానంలో కొత్తదానికి దరఖాస్తు చేయొచ్చు
- పాత రేషన్ కార్డులో లేనటువంటి కుటుంబ సభ్యులను ఆడ్ చేయడానికి అప్లై చేయొచ్చు
లబ్ధిదారుల సంఖ్య
హరీష్ రావు గారి ప్రకటన ప్రకారం – గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ పరిమితి ₹60,000 నుంచి ₹1.5 లక్షలకి పెంచబడింది, పట్టణ ప్రాంతాలలో ₹75,000 నుంచి ₹2.5 లక్షలకి పెంచబడింది.
భూమి కలిగిన కుటుంబాలకు కూడా నిబంధనలు సడలించి, లక్షలాది మంది పేద కుటుంబాలకు రేషన్ కార్డు సౌకర్యం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు
- సర్వే వ్యవధి: జనవరి 16 – 25, 2025
- మార్పుల అమలు: జనవరి 26, 2025 నుంచి
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- ఇమెయిల్ ఐడి
- మొబైల్ నెంబర్
- విద్యుత్ బిల్లు
- చిరునామా రుజువు
- పాన్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
తెలంగాణ రేషన్ కార్డు ప్రత్యేకతలు
- అవసరమైన నిత్యావసర వస్తువులపై భారీ తగ్గింపు
- ప్రభుత్వ గుర్తింపు పత్రంగా ఉపయోగపడే అధికారం
- కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ ద్వారా జారీ
మీ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడే వెబ్‌సైట్‌కు వెళ్లండి! లేదంటే కొత్త రేషన్ కార్డు లభించే అవకాశం మిస్ అవ్వొచ్చు!