Vishwakarma Scheme: హస్తకళలు మరియు పనిముట్లతో పని చేసే సాంప్రదాయ కళాకారులను గుర్తించి వారికి tool kit మరియు ఉపాధి రుణాన్ని అందించడానికి కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకంలో free tool kit ఇవ్వడానికి దరఖాస్తు ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. Online లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను కేంద్రం కొంతకాలంగా నిలిపివేసింది. తాజాగా మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తారు. వీటితో టూల్‌కిట్‌ను కొనుగోలు చేయవచ్చు.
నేరుగా కాదు..
Related News
PM Vishwakarma Yojana కింద, చేతితో లేదా పనిముట్లతో సంప్రదాయ పని చేసే వారికి కేంద్రం టూల్‌కిట్‌ను అందిస్తుంది. కానీ ఈ టూల్‌కిట్‌ను కేంద్రం నేరుగా అందించదు. 15 వేలు కొనుగోలు చేసేందుకు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఉలి చెక్కేవారు ఉలి, సుత్తి తదితర ఉపకరణాలను రూ.15,000కు కొనుగోలు చేయవచ్చు. టైలర్లు కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.
18 రకాల టూల్ కిట్లు..
PM Vishwakarma Yojana ఆధ్వర్యంలో 18 రకాల వృత్తులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18 రకాల హస్తకళాకారులు, చేనేత కళాకారులకు టూల్ కిట్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో tool kit కు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతాయి. ఇది కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. వడ్రంగి, పడవ తయారీదారు, బంగారు ఆభరణాల తయారీదారు, నిర్మాణ కార్మికుడు, లోహపు పనివాడు, సుత్తి తయారీదారు, టూల్ కిట్ తయారీదారు, విగ్రహాల తయారీదారు, రాతి పగలగొట్టేవాడు, కుమ్మరి, షూ మేకర్, దుప్పటి మేకర్, mattress మేకర్, మత్ మేకర్, బొమ్మల తయారీదారు, కొబ్బరి తాడు తయారీదారు, బార్బర్ , కేంద్రం దండలు తయారు చేసేవారికి, గుడ్డ ఉతికేవారికి, టైలర్లకు మరియు చేపల వల తయారీదారులకు టూల్ కిట్‌లను అందిస్తుంది.