ఈ నంబర్లతో UPI ఇక పని చేయదు.. ఏప్రిల్ 1 తర్వాత మీరు పేమెంట్స్ చేసుకోలేరు… వెంటనే ఈ పని చేయండి…

UPI వాడే వారు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏప్రిల్ 1 నుంచి ఇంక్రియాక్టివ్ నంబర్లకు UPI సర్వీసులు నిలిపివేయనున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటన ప్రకారం, ఇన్ఆక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ అయిన UPI ఖాతాలను డిసేబుల్ చేయనున్నారు. దీంతో Google Pay, PhonePe, Paytm వంటి యాప్స్ పని చేయవు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఎవరికి UPI సేవలు నిలిపివేయబడతాయి?

  • మొబైల్ నంబర్ మార్చుకున్నా, బ్యాంక్‌లో అప్డేట్ చేయని వారు
  • నెలల తరబడి వాడని, ఇన్యాక్టివ్ నంబర్లకు లింక్ అయిన UPI ఖాతాలు
  •  నంబర్ మార్చిన తర్వాత కూడా పాత నంబర్‌తో UPI కొనసాగిస్తోన్న వారు
  •  మీ మొబైల్ నంబర్ కొత్తగా ఎవరికైనా అలాట్మెంట్ అయితే, వారి చేతికి మీ UPI వెళ్ళే ప్రమాదం ఉంది

 ఎందుకు ఈ మార్పు?

NPCI ప్రకారం, ఇంక్రియాక్టివ్ నంబర్లతో లింక్ అయిన UPI ఖాతాలు సైబర్ మోసాలకు గురయ్యే అవకాశముంది. చాలా మంది నంబర్ మార్చిన తర్వాత పాత నంబర్‌తో లింక్ ఉన్న UPI ఖాతాలను డిలీట్ చేయరు. ఇది ఫ్రాడ్‌కు అవకాశం కల్పిస్తుంది. అందుకే ఏప్రిల్ 1 నుంచి ఇలాంటి నంబర్లను UPI నుండి తొలగిస్తున్నారు.

 UPI నిలిపివేయకుండా ఉండాలంటే?

  • మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేయండి
  • నంబర్ మార్చినట్లయితే వెంటనే బ్యాంక్‌లో అప్డేట్ చేయించుకోండి
  •  ఇన్ఆక్టివ్ నంబర్లతో లింక్ ఉన్న UPI ID ఉంటే కొత్త నంబర్‌తో అప్‌డేట్ చేసుకోండి

 బ్యాంకులు ఏం చేయబోతున్నాయి?

  • NPCI సూచనల ప్రకారం, బ్యాంకులు రెగ్యులర్‌గా చెక్ చేసి ఇంక్రియాక్టివ్ UPI IDలను తొలగించనున్నాయి
  • బ్యాంకులు తొలగించడానికి ముందు నోటిఫికేషన్ పంపిస్తాయి
  •  ఏప్రిల్ 1కి ముందు నంబర్ అప్డేట్ చేసుకుంటే, UPI ID కొనసాగుతుంది

ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ UPI ID పనిచేయకుండా పోయేలోపు బ్యాంక్‌లో మీ నంబర్ అప్డేట్ చేయించుకోండి. ఆలస్యం చేస్తే UPI బ్లాక్ అవ్వచ్చు

Related News