పెట్టుబడిదారులకు పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 1,439 పాయింట్లకు పైగా పడిపోయింది. మరోవైపు.. నిఫ్టీ 431 పాయింట్లకు పైగా నష్టపోతూనే ఉంది. ఒకే రోజులో 18 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, విదేశీ పెట్టుబడిదారులు ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లను అమ్ముతూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ 30 ఏళ్లలో అత్యంత దారుణమైన నష్టాన్ని నమోదు చేసింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 2 శాతం పడిపోయాయి. భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టీలో, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్ అతిపెద్ద నష్టాలను చవిచూశాయి. మరోవైపు, కోల్ ఇండియా అత్యధికంగా లాభపడింది, నిఫ్టీ ఆటో ఇండెక్స్ దాదాపు 2.5 శాతం పెరిగింది.
Stock Markets: ఇన్వెస్టర్లకు ఊహించని షాక్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు!!

28
Feb