ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు ఫైనల్‌లోనూ సత్తా చాటింది. దీంతో తొలిసారిగా అండర్-19 విభాగంలో జరిగిన ఆసియా కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. మహిళల టీ20 ఫార్మాట్‌లో తొలిసారిగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. 41 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సగర్వంగా కప్ అందుకుంది.
ఇటీవల జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆఖరి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు వరుస షాక్‌లు ఎదురయ్యాయి.
బౌలింగ్‌కు స్వర్గధామంగా మారిన పిచ్‌పై బంగ్లాదేశ్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. బౌలింగ్‌కు వికెట్ పూర్తిగా అనుకూలంగా ఉండడంతో భారత్ నిర్దేశించిన చిన్న లక్ష్యమే బంగ్లాదేశ్‌కు కొండంత అండగా నిలిచింది. జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మినహా ఆ జట్టులోని అందరూ ఫ్లాప్ అయ్యారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఇలా సాగింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లతో ప్రత్యర్థి నరాలు విరిచాడు. సిసోడియా, సోనమ్ యాదవ్ చెరో 2 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.