Telangana APSET Engineering admissions కోసం నిర్వహించిన EAPSET 2024 ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన counseling schedule వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. engineering colleges లకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. All India Council of Technical Education (AICTE) ఇచ్చిన గడువులోగా అడ్మిషన్లు పూర్తవుతాయి. యాజమాన్య కోటా (B category ) సీట్లను ఇష్టానుసారంగా విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. MBBS seats మాదిరిగా A, B and C categories లుగా విభజించి ఫీజులను నిర్ణయించడం, లేదా ఈ విషయంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా చదివి, నేరుగా B.Tech or B.Pharmacy ద్వితీయ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామని ఆయన వెల్లడించారు. private universities ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తులు కోరడం లేదని, అయితే కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతులు ఇస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.
An Act to regulate private school fees
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా private colleges fees ప్రత్యేక చట్టం తీసుకువస్తామని బుర్రా వెంకటేశం అన్నారు. వేసవి సెలవులు ముగుస్తున్నందున ఈ విద్యాసంవత్సరానికి అది సాధ్యం కాకపోవచ్చునని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసినా చట్టం చేయలేదని, ఇందుకు సంబంధించిన బిల్లులను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. అలాగే వైస్ ఛాన్సలర్ల నియామకం కూడా ఆలస్యమవుతుందని చెప్పారు. ఈ ఏడాది మే 21తో యూనివర్సిటీ వీసీల పదవీకాలం ముగియనుందన్నారు. ఎన్నికల కోడ్ తదితర కారణాలతో కొత్త వీసీల నియామకం ఆలస్యమైందన్నారు. కొత్త వీసీల నియామకం జరిగే వరకు ఆయా యూనివర్సిటీల్లో తాత్కాలిక వీసీలుగా IAS లను నియమించాలా లేక సీనియర్ ప్రొఫెసర్లను నియమించాలా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.