ఇంటికి స్కూల్ నుంచి తిరిగొచ్చిన పిల్లలకి ఏదైనా హాట్ హాట్ గా, రుచిగా తినడానికి ఇవ్వాలని ప్రతి తల్లి కోరుకుంటారు. కానీ, పిల్లలు రెగ్యులర్‌గా ఉండే వంటకాలను తినాలంటే ఆసక్తి చూపించరు. ఎప్పుడూ ఏదైనా కొత్త టేస్ట్ కావాలంటారు. అలాంటి సమయంలో సింపుల్‌గా, త్వరగా తయారయ్యే ఒక బేకరీ స్టైల్ స్నాక్ మీకు చెప్పబోతున్నాం. అదే “ఆలూ బటర్ శాండ్‌విచ్”.
ఇది రుచిలో బేకరీలలో దొరకే శాండ్‌విచ్‌లకు పోటీపడేలా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్లకూ ఈ టేస్ట్ మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. స్కూల్ నుంచి వచ్చేసిన పిల్లలకు వేడి వేడి ఆలూ శాండ్‌విచ్ ఇవ్వగలిగితే వాళ్ల ముఖంలో ఆనందం చూశాక కడుపు నిండి పోతుంది!
తయారీ ప్రక్రియ కూడా చాలా సింపుల్. మొదట బంగాళదుంపలు ఉడికించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికం, టమాటా, స్వీట్‌కార్న్, కొత్తిమీర మాదిరిగా తరిగి రెడీగా ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మ్యాష్ చేసిన బంగాళదుంపలు, తరిగిన కూరగాయలు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, బటర్, రెడ్ చిల్లీ సాస్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకుని వాటిని త్రిభుజాకారంగా కట్ చేయాలి. వాటిపై ఈ స్టఫింగ్‌ని తగినంత spread చేసి, మరో బ్రెడ్ ముక్కతో కవర్ చేయాలి. పాన్‌పై కొద్దిగా బటర్ వేసి, ఈ శాండ్‌విచ్‌లను వేడి వేడిగా రెండు వైపులా బాగా కాల్చాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లో పెట్టి టమాటా సాస్‌తో సర్వ్ చేస్తే, బయట కొనిచ్చిన శాండ్‌విచ్ కన్నా రుచిగా ఉంటుంది.
ఇది కేవలం స్కూల్ నుంచి వచ్చే పిల్లలకే కాదు, కాలేజీకి వెళ్లే టీనేజర్స్‌కి, టిఫిన్ టైం మిస్ అయిన వర్కింగ్ పర్సన్‌కి కూడా సరైన స్నాక్. ముఖ్యంగా కూర వండే టైం లేకపోయినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. చిల్లిగవ్వ ఖర్చుతో ఇంట్లోనే బేకరీ స్టైల్ టేస్ట్‌కి treat ఇచ్చేయండి!