Top Colleges in Hyderabad: హైదరాబాద్‌లో టాప్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే..!

హైదరాబాద్, మే 30: తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. DOST డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మరోవైపు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్ వంటి వివిధ ప్రవేశ పరీక్షల ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని టాప్ డిగ్రీ కాలేజీలకు పలువురు విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) దేశంలోని టాప్ 200 విద్యాసంస్థలలో హైదరాబాద్‌లోని రెండు డిగ్రీ కాలేజీలను ర్యాంక్ చేసింది.

హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ  టాప్ డిగ్రీ కాలేజీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలోని టాప్ 100 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చెందిన ఏకైక కళాశాల ఇదే.

రెండవది లోయలా అకాడమీ. భారతదేశంలోని టాప్ 200 ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ రెండు డిగ్రీ కాలేజీలు హైదరాబాద్‌లోని టాప్ కేటగిరీలో ఉన్నాయి.

హైదరాబాద్‌లోని top ఇంజనీరింగ్ కళాశాలలు

డిగ్రీ కాలేజీలతో పాటు హైదరాబాద్‌లోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల జాబితాను కూడా ఎన్‌ఐఆర్‌ఎఫ్ విడుదల చేసింది. నగరంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-హైదరాబాద్) మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

టాప్ 100 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లలో హైదరాబాదులోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- టాప్ 8
  • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్- టాప్ 55
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – టాప్ 71
  • జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – టాప్ 83

హైదరాబాదులో పైన పేర్కొన్న ఇంజనీరింగ్ కళాశాలలే కాకుండా కింది సంస్థలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి.

  • అనురాగ్ యూనివర్సిటీ
  • గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
  • వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
  • చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్
  • మహీంద్రా విశ్వవిద్యాలయం
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ