అమరావతి: తనకు కేబినెట్‌లో కేటాయించిన శాఖలు జనసేన ప్రాథమిక సూత్రాలకు, తన హృదయానికి దగ్గరగా ఉన్నాయని AP DEPUTY CM పవన్ కల్యాణ్ అన్నారు. కీలక శాఖలను కేటాయించినందుకు CM CHANDR BABU కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం విశేషం. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ఉపాధి హామీ నిధుల వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్ వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అటవీ సంపదను కాపాడి పచ్చదనాన్ని పెంచుతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
Related News
నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు ప్రజా సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. టూరిజం ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. సినిమా రంగానికి రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, యువతకు ఆ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.