ఏప్రిల్ 11, 2025 న భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఒక భారీ అలర్ట్ ఇచ్చింది. ఈ అలర్ట్ భారతదేశంలోని కోట్లాది Android యూజర్లు గమనించాల్సిన హెచ్చరిక. ఎందుకంటే ఈ బగ్ వల్ల హ్యాకర్లు మీ ఫోన్‌కి దూరంగా ఉండగానే కంట్రోల్ పొందగలరు. మీ వ్యక్తిగత డేటా కూడా వారు దొంగిలించగలరు.
ఎందుకు ఇది ఇంత డేంజర్?
ఈ సెక్యూరిటీ లోపాలు ముఖ్యంగా MediaTek లేదా Qualcomm ప్రాసెసర్లపై నడిచే Android ఫోన్లను టార్గెట్ చేస్తాయి. మరీ ముఖ్యంగా Google Play System అప్డేట్స్ కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయి. మనం సాధారణంగా ఫోన్‌కి వచ్చేవి అనుకొని ఇగ్నోర్ చేసే గూగుల్ ప్లే అప్డేట్లు… ఇప్పుడు డేంజర్ అయ్యాయి
CERT-In ప్రకారం, Android లోని Framework, System, Kernel, Arm, MediaTek, Qualcomm వంటి భాగాల్లో ఉన్న బగ్‌లు కారణంగా హ్యాకింగ్ జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా Android 13, 14, 15 కి ముందు వర్షన్లు వాడుతున్నవారైతే ప్రమాదంలో ఉన్నారు. మీరు Android 12 లేదా 12L వర్షన్ వాడుతున్నా వెంటనే అప్డేట్ చేయాలి.
Related News
మీ ఫోన్ ప్రమాదంలో ఉందా? ఇలా తెలుసుకోండి
మీరు ఉపయోగిస్తున్న ఫోన్ Android 12 లేదా తక్కువ వర్షన్‌లో ఉందా? అయితే వెంటనే అప్డేట్ చేయకపోతే మీ ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌లు, OTPలు, ఫోటోలు, మెసేజ్‌లు అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఇది High Severity Alert.
హ్యాకర్ల నుంచి ఎలా కాపాడుకోవాలి?
Google ఇప్పటికే ఈ బగ్‌లను గుర్తించి అప్డేట్లను రిలీజ్ చేసింది. మీరు చేయాల్సింది చాలా సింపుల్:
మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి. System Update సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ లభ్యమవుతోన్న నూతన అప్డేట్ ఉంటే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఇంతకంటే సులభంగా మీ Android ఫోన్‌కి సెక్యూరిటీ కల్పించలేరు. ఇక నుంచి హ్యాకింగ్ ప్రమాదం తక్కువ అవుతుంది
ఒక్క అప్డేట్ ఆలస్యం వల్ల లక్షలు పోవచ్చు
ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్, ఫోటోలు, వీడియోలు అన్నింటినీ ఫోన్‌లోనే ఉంచుతున్నాం. అలాంటి ఫోన్ హ్యాక్ అయితే మన వ్యక్తిగత జీవితం మొత్తం లీక్ కావచ్చు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించబడవచ్చు. ఈ ప్రమాదాన్ని తక్కువగా తీసుకోకండి.
ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అప్డేట్ చేయండి
ఈ అప్డేట్ అందరికి Play System Updates రూపంలో వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు మాన్యువల్‌గా కూడా చెక్ చేయొచ్చు. Settings > System Update అనే సెక్షన్‌లోకి వెళ్లి కొత్త అప్డేట్ ఉందా చూసుకోండి. ఉన్నట్లయితే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఈ పని చేయడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ చేయకపోతే మీరు పడే నష్టాన్ని ఊహించలేరు.
తీరని నష్టం కాకముందే అప్డేట్ చేయండి
CERT-In వంటి ప్రభుత్వ సంస్థలు ఇలా హెచ్చరికలు ఇవ్వడమే ఒక తీవ్రమైన విషయం. ఇవి చిన్నపాటి బగ్‌లు కాదు. మీరు తక్షణమే అప్డేట్ చేయకపోతే, మీరు హ్యాకింగ్‌కు బలవుతారు. ఇది మీ బాధ్యత – మీ ఫోన్‌ను, మీ డేటాను, మీ డబ్బును రక్షించుకోవడం.
ఫైనల్ మెసేజ్
ఒక్కసారిగా మీ ఫోన్‌ను చెక్ చేయండి. Android 13కి మించిన వర్షన్ ఉందా లేదా తెలుసుకోండి. లేదంటే వెంటనే అప్డేట్ చేయండి. లేదంటే పశ్చాత్తాపం తప్పదు. “ఆ రోజు చేయాల్సింది కానీ మర్చిపోయాను” అనే మాట చెప్పుకోకండి. ఆ రోజు… అంటే ఈ రోజు.
మీ డేటా మీ చేతుల్లో ఉంది – అప్డేట్ చేయకపోతే అది హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది