ఆ 3 బ్రాండ్ల ఫోన్స్ వాడుతున్నారా? మీ పర్సనల్ డేటా హ్యాకర్స్ చేతిలోకి !

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అప్ డేట్స్, ఫోటోలు, వీడియోలు, పర్సనల్ మెసేజ్ లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇలా అన్నీ ఆ స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వచ్చాక..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ప్రజల జీవన విధానం కూడా చాలా మారిపోయింది. అలాగే జీవితం తేలికగా మారింది. కానీ, అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వల్ల అనర్థాలు, నష్టాలు, కష్టాలు కూడా పెరిగాయి. చిన్న పొరపాటు కూడా మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని హ్యాకర్ల చేతుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఏకంగా మూడు కంపెనీల ఫోన్లు వాడుతున్న వారికి ఈ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్లు బాగా వినియోగిస్తున్నారు. అయితే, మన వ్యక్తిగత సమాచారం మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సురక్షితంగా ఉన్నాయా? అవి ఖాయమని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు హ్యాకర్లు కూడా కొత్త మార్గాల్లో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్ నిపుణులు చెబుతున్న వార్త చూస్తుంటే స్మార్ట్ ఫోన్ వాడాలంటే తికమక పడాల్సిందే. షియోమీ, రెడ్‌మీ, పోకో కంపెనీలకు చెందిన డివైజ్‌లలో ఈ ప్రాణాంతక వైరస్ ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఐదు రోజుల పాటు ఈ మూడు కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లలో ఈ ప్రమాదకరమైన వైరస్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ఈ వివరాలు ప్రచురించబడ్డాయి. వారు చెప్పినదాని ప్రకారం, Xiaomi, Redmi, Poco పరికరాలలో ప్రమాదకరమైన వైరస్లు కనుగొనబడ్డాయి, అవి సిస్టమ్ ఫైల్‌లు లేదా ఇతర అనువర్తనాలు కావచ్చు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది, ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు అందించగలదు. MIUI మరియు Hyper OSని ఉపయోగించే Xiaomi, Redmi మరియు Poco పరికరాలలో ఈ సమస్య కనుగొనబడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, Xiaomi తన MIUIని హైపర్ OSగా రీబ్రాండ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు ఆ హైపర్ ఓఎస్ లోనే ఈ తరహా సమస్య వచ్చి వినియోగదారులను కలవరపెడుతోంది. Gallery, Get Apps, Mi Video, MIUI Bluetooth, Phone Services, Print Spooler, Security, Security Core Component, Settings, Share Me, System Tracing, Xiaomi Cloudలో వైరస్ గుర్తించబడిందని బ్లాగ్ వెల్లడించింది. అయితే దీన్ని ఎంతవరకు నమ్మాలో తెలియడం లేదు. ఎందుకంటే ఈ విషయమై Xiaomi ఇంకా ఎలాంటి అధికారిక హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ మూడు కంపెనీలు ఈ వైరస్‌ను గుర్తించడం మరియు పరిష్కరించడం గురించి త్వరలో అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *