జుట్టు రాలడం వల్ల స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. పురుషులలో అధిక జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ధూమపానం, ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం, పోషకాల లోపం, షాంపూ చేసేటప్పుడు చేసే పొరపాట్లు, వేడి నీళ్లతో తల స్నానం చేయడం వంటివి జుట్టు రాలడానికి దారితీస్తాయి.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే నూనె చాలా ఉపకరిస్తుంది. ఈ నూనెను వారానికి రెండుసార్లు రాసుకుంటే జుట్టు రాలడం అదుపులో ఉంటుంది. కాబట్టి ఆ నూనెను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇనుప కడాయి పెట్టి అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె వేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతికూర, రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన బాదంపప్పు వేసి కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి.
Related News
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, స్టయినర్‌తో నూనెను ఫిల్టర్ చేయాలి. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేసుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.
ఈ నూనెను స్కాల్ప్ తో పాటు మొత్తం జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. నూనె రాసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల తర్వాత, తేలికపాటి షాంపూతో మీ తలను కడగాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఎత్తు పెరగడం మొదలవుతుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడే పురుషులకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.