రంజాన్ మాసంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ ముస్లింలకు చాలా పవిత్రమైన మాసం. ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. మార్చి 2 నుండి 31 వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు 24 గంటలు పనిచేయడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో నగరంలోని వ్యాపార సముదాయాలు వచ్చే నెల దాదాపు 22 రోజుల పాటు 24 గంటలు తెరిచి ఉంటాయి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకోగా ఈ మేరకు శాంతి కుమారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు జీవో జారీ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
హిందూ పండుగలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. రేట్లు పెంచి ముస్లింలకు విరామం ఇచ్చి మత రాజకీయాలు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా నిర్ణయంపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ రంజాన్ మాసంలో, వస్త్ర వ్యాపారంతో పాటు, ఆహార వ్యాపారం హైదరాబాద్ నగరం అంతటా పెద్ద మొత్తంలో జరుగుతుంది. రంజాన్ మాసంలో మాత్రమే లభించే హరీస్ కు అభిమానులు ఎక్కువగా ఉంటారు. రంజాన్ వస్తే, నగరంలోని అనేక ప్రాంతాల్లో బట్టీలు ఏర్పాటు చేసి ఈ హరీస్ తయారు చేస్తారు. ఈ హరీస్ తినే వారిలో ముస్లింల కంటే ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు.