తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 అభ్యర్థులను అప్రమత్తం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల.
ర్యాంకింగ్ జాబితాను TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. తాత్కాలిక మార్కుల జాబితా ఇప్పటికే విడుదలైందని తెలిసింది.
మరోవైపు, 563 పోస్టుల నియామకానికి TGPSC ఫిబ్రవరి 19, 2024న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు, 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరిలో 21,093 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదలయ్యాయి..
తాత్కాలిక మార్కుల జాబితా ఇప్పటికే విడుదల కాగా, ఇటీవల జనరల్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. మార్చి 31 నాటికి గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఫలితాలను విడుదల చేశారు.