Telangana లోని engineering colleges ల్లో admissions counseling schedule ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. అడ్మిషన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఉన్నత విద్యా మండలి లింబాద్రి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. Counseling ప్రక్రియను ప్రారంభించే ముందు విద్యార్థులు ఎస్ఎస్సి, ఇంటర్ మార్కుల మెమోలు, టిసి, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం దయచేసి TGEAPSET Website ను సందర్శించండి.
- June 27 నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
- June 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
- July 12న తొలి బ్యాచ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
- July 19 నుంచి ఇంజినీరింగ్ రెండో రౌండ్ కౌన్సెలింగ్.
- July 24న రెండో బ్యాచ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
- July 30 నుంచి ఇంజినీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్.
- August 5న చివరి బ్యాచ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
- కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయం.
- August 12 నుండి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ.
- August 16న అంతర్గత స్లైడింగ్ సీట్ల కేటాయింపు.
- August 17న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేసింది.
Official Website: https://eapcet.tsche.ac.in/