ప్రతి వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలా అని మొబైల్ పట్టుకొని టైటిల్స్ చూస్తున్నారా? ఈసారి అలా కాకుండా… మన దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుల గురించి చూసేద్దాం. మన ఇండియన్ ఆర్మీ సాహసాలు, త్యాగాలు చూపించే సినిమాలు కొన్ని ఓటీటీలో రెడీగా ఉన్నాయి. వీటిలో కొన్ని నిజమైన కథల ఆధారంగా ఉంటే, మరికొన్ని స్ఫూర్తిదాయక యాక్షన్ డ్రామాలు. చూస్తుంటే గూస్బంప్స్ వచ్చేలా ఉంటాయి.
దేశభక్తి, ప్రేమ, త్యాగం మేళవిన సినిమాలు ఇవి. ముఖ్యంగా “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” అనే సినిమా ఇప్పటికీ యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. రూ.359 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీని ఇప్పుడు మీరు ఫ్రీగా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు?
ఈ పోస్ట్‌లో 15 అద్భుతమైన ఇండియన్ ఆర్మీపై తీసిన సినిమాల వివరాలు ఇస్తున్నాం. వీటిని తప్పకుండా చూడండి.
1. Shershaah (2021)
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథ ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా నటన హైలైట్. అతడి ధైర్యం, దేశ భక్తి, ప్రేమ అన్నీ కలిపిన ఈ కథ మనసును తాకుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
2. Major (2022)
ముంబై 26/11 దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. అడివి శేష్ తన నటనతో ప్రజలను కంటతడి పెట్టించాడు. ఈ సినిమా ఓటీటీలో చూసే వారికి గర్వభావన కలుగుతుంది.
3. Gunjan Saxena: The Kargil Girl (2020)
భారతదేశపు మొదటి మహిళా వార్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కింది. జాన్వీ కపూర్ నటన ఆకట్టుకుంది. ఆమె ధైర్యం, ఆమె ఎదుట వచ్చిన లింగ వివక్షకు ఆమె గివప్ కాకుండా ఎదుర్కొన్న తీరు చూస్తే ఎంతో స్ఫూర్తినిస్తుంది.
4. Sam Bahadur (2023)
ఇది భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవిత కథ. విక్కీ కౌశల్ నటన, 1971 యుద్ధ సమయంలో ఆయన చూపిన నాయకత్వ గుణాలు ఎంతో గొప్పగా చూపబడ్డాయి.
5. The Ghazi Attack (2017)
ఇది ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన సముద్ర యుద్ధం కథ. ఓ సబ్‌మెరైన్ మిషన్‌లో భారత నావికా దళం ఎలా విజయం సాధించిందో చూపిస్తుంది. చాలా టెన్షన్, థ్రిల్ కలిగించే కథ.
6. Pippa (2023)
1971 యుద్ధ సమయంలో యంగ్ కెప్టెన్ బలరామ్ సింగ్ కథ ఇది. యువ సైనికుడిగా, దేశసేవలోని మార్గాన్ని ఎంచుకున్న ఓ యువకుడి కమింగ్-ఆఫ్-ఏజ్ కథ. ఇది Prime Videoలో ఉంది.
7. Uri: The Surgical Strike (2019)
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “How’s the Josh?” అనే డైలాగ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా రూ.359 కోట్లు కలెక్ట్ చేసింది. భారత సైన్యం ఉరి దాడి తర్వాత పాకిస్థాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది. మిస్ అవ్వకండి!
8. Border (1997)
లాంగేవాలా యుద్ధం ఆధారంగా తీసిన ఈ మూవీ ఒక టైంలెస్ క్లాసిక్. సైనికుల ప్రేమ, బాధ, ధైర్యం అన్నీ చూపుతుంది. సన్నీ డియోల్ నటన, పాటలు, యాక్షన్ సీన్స్ ఇప్పటికీ బలంగా గుర్తుంటాయి.
9. LOC: Kargil (2003)
బహుళ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కార్గిల్ యుద్ధం సమయంలోని భారత ఆర్మీ పోరాటాలను చూపుతుంది. అజయ్ దేవ్‌గణ్, సంజయ్ దత్, ఇతర పెద్ద నటులు ఇందులో కనిపిస్తారు.
10. Lakshya (2004)
హృతిక్ రోషన్ ఓ నిర్దేశం లేని కుర్రాడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరి సైనికుడిగా ఎలా ఎదిగాడో చూపించే సినిమా ఇది. యూత్ కోసం తప్పకుండా చూడదగిన సినిమా.
11. Main Hoon Na (2004)
ఫన్, యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయిన మూవీ ఇది. షారుక్ ఖాన్ ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. డ్యూటీతో పాటు వ్యక్తిగత బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో చూపించే చిత్రమిది.
12. Sita Ramam (2022)
తెలుగు ప్రేక్షకులకు ఇది హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. సైనికుడి ప్రేమకథ, దేశభక్తి, ఓ లెటర్ ద్వారా నడిచే కథాంశం చూడముచ్చటగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట గుండెల్లో నిలిచిపోతారు.
13. Shaurya (2008)
ఓ కోర్ట్‌రూమ్ డ్రామా. ఆర్మీ లాయర్ తన సహాధికారిపై జరిగిన న్యాయ విరుద్ధ వ్యవహారాన్ని ఎలా ఛేదించాడు అన్నదే కథ. చివరివరకు ఉత్కంఠగా నడుస్తుంది.
14. Fighter (2024)
హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన తాజా యాక్షన్ డ్రామా ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ల జీవితాన్ని ఆధారంగా తీసుకున్నారు. స్టైల్, యాక్షన్, విజువల్స్ అన్నీ కూడా హైలైట్.
ఈ సినిమాల ప్రత్యేకత ఏంటంటే?
వీటిలో కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్, కొన్ని ఇన్స్పిరేషనల్ డ్రామాలు, కొన్ని ఫుల్ యాక్షన్ ప్యాక్డెడ్ మూవీస్. కానీ ఒక్కో సినిమాలోనూ మన భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశానికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీకెండ్ ఓటీటీ స్క్రోలింగ్‌కు బదులుగా, ఈ సినిమాలే చూడండి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇందులో ముఖ్యంగా “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు చూస్తే ఫ్రీ.. రేపటికి తీసేస్తే? మిస్ అవ్వకండి.
ఏ సినిమా మీకు నచ్చింది? మీరు వీటిలో ఏవైనా చూసారా?